BJP, SP manifestos battle it out over farm, jobs, crime యూపీలో బీజేపి-ఎస్పీ పార్టీల మేనిఫెస్టోలలో ఉచితాల పోటాపోటీ..

Bjp samajwadi party release up manifesto promise free cylinders free petrol

Assembly Elections 2022, UP Assembly Election, Poll Promises, BJP Release UP Manifesto, Samajwadi Party Release UP Manifesto, Congress UP Manifesto, Uttar pradesh polls, Uttar Pradesh Assembly Elections, Congress, SP, BJP, RLD, BSP, National Politics

The BJP released its manifesto for UP promising of free electricity (for irrigation purposes) for all farmers and employment to at least one member of each family, free LPG cylinders for women on the occasion of Holi and Diwali. The Samajwadi Party also promised two free cylinders for the poor each year and free petrol to autorickshaws.

ఉత్తరప్రదేశ్ లో బీజేపి-ఎస్పీ పార్టీల మేనిఫెస్టోలలో ఉచిత హామీల పోటాపోటీ..

Posted: 02/09/2022 01:41 PM IST
Bjp samajwadi party release up manifesto promise free cylinders free petrol

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దేశంలోనే అత్యధిక స్థానాలు కలిగిన రాష్ట్రంగా పేరొందిన యూపీలో విజయం వరించిన పార్టీకి.. కేంద్రంలోనూ చక్రం తిప్పే అవకాశం కలగడమే అందుకు కారణం. దీంతో దేశంతో పాటు ప్రపంచ దృష్టి కూడా ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలపై పడింది. ఇక ఇలాంటి రాష్ట్రంలో తమ ప్రత్యర్థి పార్టీలపై ఉనికి చాటుకుని అధిపత్యం చెలాయించడంతో పాటు అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ఇప్పటికే ప్రధాన పార్టీలు కుస్తీపడుతున్నాయి. ఈ క్రమంలో పార్టీలు రాష్ట్ర ప్రజలపై వరాలను కురిపిస్తున్నాయి. ఉచిత పథకాలు, ఉచిత హామీలను ఇస్తూ ప్రజలకు ఉచిత ఎన్నికల వాగ్ధానాలను కురిపిస్తున్నాయి.

ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం ఉచిత ఎన్నికల వాగ్ధానాలపై కళ్లెం వేసేలా.. కేంద్ర ఎన్నికల సంఘం సహా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఓ పిటీషన్ విచారణ సందర్భంగా కీలకవ్యాఖ్యలు చేసినా.. తమకు గెలుపే ముఖ్యమని భావిస్తున్న పార్టీలు మాత్రం ఎన్నికలవాగ్ధానాలకే మొగ్గుచూపుతూ తమ మానిఫెస్టోలను సైతం విడుదలచేశాయి. మళ్లీ అధికారం ఇస్తే ‘లవ్ జిహాద్’కు పాల్పడిన వారికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని, లక్ష రూపాయల జరిమానా విధిస్తామని చెబుతూ యూపీ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ‘లోక్ కల్యాణ్ సంకల్ప్ పత్ర -2022’ పేరిట రూపొందించిన ఈ మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న విడుదల చేశారు.

కుటుంబానికో ఉద్యోగం, వచ్చే ఐదేళ్లపాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్, చెరుకు రైతుకు రెండు వారాల్లో బిల్లులు, ఆలస్యమైతే మిల్లుల యజమానుల నుంచి వడ్డీ వసూలు, ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కూటర్లు, విద్యార్థులకు రెండు కోట్ల ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లు ఉచితంగా అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. పూర్తి వసతులతో జిల్లాకో ఆసుపత్రి నిర్మించడంతోపాటు హెలికాప్టర్‌ ప్రమాదంలో ఇటీవల మరణించిన జనరల్ బిపిన్ రావత్ పేరిట బుందేల్‌ఖండ్‌లో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. బీజేపీ మేనిఫెస్టో అలా విడుదల చేసిందో లేదో.. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా మేనిఫెస్టో విడుదల చేశారు.

బీజేపీ మేనిఫెస్టోకు ఏమాత్రం తగ్గకుండా హామీల వరద పారించారు. సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో కోటి, ఐటీ రంగంలో 22 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎస్పీ తమ మేనిఫెస్టోలో పేర్కొంది. అలాగే, విద్యాశాఖలో ఖాళీల భర్తీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్, అమ్మాయిలకు పీజీ వరకు ఉచిత విద్య, 2025 నాటికి రైతులను రుణ విముక్తులను చేయడం, రెండెకరాల లోపు ఉన్న వారికి ఎరువులు, బీపీఎల్ దిగువనున్న కుటుంబాలకు ఏడాదికి ఉచితంగా రెండు గ్యాస్ సిలిండర్లు, ఆటో డ్రైవర్లకు నెలకు 3 లీటర్లు, ద్విచక్ర వాహనదారులకు లీటరు పెట్రోలు ఉచితంగా అందిస్తామని ఎస్పీ తన మేనిఫెస్టోలో పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles