ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో రసవత్తర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల షడ్యూల్డు వెలువడిన వెంటనే అధికార బీజేపికి చెందిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నుంచి ఏకంగా ముగ్గురు బిసి మంత్రులు సహా ఎనమిది మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఈ క్రమంలో తీవ్ర పరాభవానికి గురైన బీజేపి కూడా పావులు కదుపుతూ ఏకంగా సమాజ్ వాదీ వ్యవస్తాపక అధ్యక్షుడు ములాయం సింగ్ కు షాకిచ్చేలా చేసింది. ములాయం చిన్నకొడుకు ప్రతీక్ యాదవ్ సతీమణి అపర్ణ యాదవ్ కు తమ పార్టీలో చేరేలా పావులు కదిపింది.
ఈ సారి ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీల మధ్య పోటీ నెలకొంది. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ పావులు కదుపుతుండగా, అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీ కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపికి తగిలిన వరుస ఎదురుదెబ్బలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అఖిలేష్ యాదవ్ సోదరుడు.. ములాయంసింగ్ చిన్నకుమారుడు ప్రతీక్ యాదవ్ సతీమణి అపర్ణ యాదవ్ ను తమ పార్టీలోకి చేరేలా చేయడంలో బీజేపి సఫలీకృతమయ్యింది. దీంతో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీకి ఎదురుదెబ్బ తగలింది.
ఇవాళ ఉదయం అమె బీజేపి సభ్యత్వాన్ని తీసుకున్నారు. పార్టీలో చేరడంతో అమెకు సాదరంగా ఆహ్వానించిన బీజేపీ నేతలు అమెకు పార్టీ ఖండువాను కప్పారు. ఉత్ర్ ప్రదేవ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ మౌర్య సమక్షంలో అమె బీజేపిలో చేరారు. ఈ సందర్భంగా తాను ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలకు ఆకర్షితురాలినై పార్టీలో చేరాననని అమె అన్నారు. ఈ సందర్భంగా ఢిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య మాట్లాడుతూ అఖిలేష్ యాదవ్ తన కుటుంబలోనూ అపజయం పాలయ్యారని, ఇక ఇటు రాజకీయాల్లోనూ ఆయన అపజయాన్ని మూటగట్టుకోనున్నారని విమర్శలు చేశారు, అనేక రోజుల పాటు అమెతో చర్చలు నిర్వహించిన తరువాత అపర్ణ యాదవ్ బీజేపిలోకి చేరారని తెలిపారు.
అయితే, అపర్ణ లక్నో కాంటోన్మెంట్ అసెంబ్లీ శాసనసభా స్థానం టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. 2017లో అపర్ణ అదే స్థానం నుంచి పోటీ చేసి.. బీజేపీకి చెందిన రీటా బహుగుణ జోషి చేతిలో ఓటమిని చవిచూశారు. ఎన్నికల్లో అపర్ణకు 63వేలకుపైగా ఓట్లు పోలయ్యాయయి. అపర్ణ బీజేపీలో చేరితే.. యూపీలో అధికారంలోకి రావాలని చూస్తున్న అఖిల్ యాదవ్‌కు ఈ పరిణామం పెద్ద ఎదురుదెబ్బలాంటిదే. ఓ సంస్థను నడుపుతున్న అపర్ణ బీజేపీ కార్యక్రమాలను ప్రశంసిస్తూ.. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి రూ.11లక్షలు విరాళంగా ఇవ్వడం గమనార్హం. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో ఏడు విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడత ఎన్నికలు ఫిబ్రవరి 10న జరుగనుండగా.. మార్చి 7న చివరి దశ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more