పండుగలు, జాతర్ల సమయంలో గ్రామదేవతలకు మేకలు, గోర్రెపొట్టేళను బలి ఇవ్వడం ఆనవాయితి. ఇలాంటి ఆనవాయితినే చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామంలో కూడా వుంది. సంక్రాంతి పర్వదినం మూడవ రోజున అంటే కనుమ రోజున అక్కడి గ్రామ దేవతలకు మేకలను బలిఇవ్వడం.. తరువాత వాటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన వాటిని ప్రసాదంగా గ్రామస్థులందరూ తినడం కూడా ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఈ సారి కనుమ పండగ రోజున కూడా ఈ ఆనాయితిని కొనసాగించే క్రమంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది.
మేక పోట్టేలును ఒక్క వేటున అమ్మవారికి బలి ఇచ్చేందుకు సన్నధమైన వ్యక్తి మద్యం మత్తులో దారుణానికి ఒడిగట్టాడు. పొట్టేలు అనుకుని దానిని కదలకుండా పట్టుకున్న వ్యక్తి తలను నరికిన ఘటన మండలంలో కలకలం రేపింది. వివరాలు.. మదనపల్లె మండలం వలసపల్లెలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి కనుమ పండుగను నిర్వహించారు. ఇందులో భాగంగా ఊరి పొలిమేరలో గ్రామదేవతకు జంతు బలి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తలారి లక్ష్మణ కుమారుడు తలారి సురేష్(35) పొట్టేలను పట్టుకుని ఉన్నాడు.
మరో తలారి గంగన్న కుమారుడు చలపతి మద్యం మత్తులో పొట్టేలును నరకబోయి సురేష్ తల నరికేశాడు. తీవ్ర రక్తస్రావం అవడంతో బాధితుడిని స్థానికులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సురేష్ తలను చలపతి కావాలని ఏదైనా పగబెట్టుకుని నరికాడా.? లేదా మద్యం మత్తులోనే పొరబాటున నరికాడా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more