Amaravati farmers 45-day-long padayatra from Nov 1 నవంబర్ 1న అమరావతి రైతుల మహాపాదయాత్ర

Amaravati farmers plan 45 day long padayatra against 3 capital policy

Amaravati, slogans, Anti Govt protest, Farmers agitations, Decentralisation, CRDA, Three Capital Plan, United Nations Human Rights Council,united kingdom,law,kaveti srinivas rao,International Criminal Court, Decision Amaravati, three capital, State Assembly, joint action committee, YS Jagan, ys jagan mohan reddy, chandrababu naidu, andhra pradesh capital, amaravati lands case, Chief Justice JK Maheshwari, Justice AV Sesha Sai, Justice M Satyanarayana Murthy, Supreme Court, Vijayawada, farmers, Andhra Pradesh, Politics

The Amaravati farmers, who have been agitating for over 500 days, are all set to launch a Padayatra to highlight their plight. The farmers are demanding that the Jagan government’s decision to shift the capital out of Amaravati be rescinded.

అమరావతిని రాజధాని డిమాండ్ తో తిరుపతికి రైతుల మహాపాదయాత్ర

Posted: 10/25/2021 05:18 PM IST
Amaravati farmers plan 45 day long padayatra against 3 capital policy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక పూర్తిస్థాయి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రెండేళ్లుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న ఆప్రాంత రైతులు తాజాగా తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయాలని నిర్ణయించారు. ఓ వైపు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలు.. ప్రతీ నెల 26న ఏదో ఒక రూపంలో కేంద్రంతో పాటు దేశ ప్రజల దృష్టిని ఆకర్షించేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్న తరుణంలో అమరావతి రైతులు కూడా అదే పంథాను ఫాలో కావాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఏకంగా మహాపాదయాత్ర నిర్వహించనున్నారు.

అమరావతి రైతుల నిరసన దీక్షలు ఇవాళ్టికి ఏకంగా 670 రోజులు దాటిన నేపథ్యంలో.. తమ ఉద్యమాన్ని ఇక రాష్ట్రప్రజల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని కూడా వెనక్కు తీసుకునేలా ఆ భగవంతుడి ఆశీర్వచనాలు కూడా కావాలని ఏకంగా 45 రోజుల పాటు అమరావతి నుంచి తిరుపతి వరకు మహాపాదయాత్ర నిర్ణయించనున్నారు. ఈ పాదయాత్రను వచ్చే నెల నవంబర్ 1 నుంచి ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్రలో రైతులు తమ డిమాండ్ కు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా వ్యవహరించాలని ప్రజలను కూడా కోరనున్నారు.

ఈ నేపథ్యంలో అమరావతిలోని వెలగపూడిలో అమరావతి జేఏసీ నేతలు సన్నాహక సమావేశం నిర్వహిచారు. రాష్ట్రప్రభుత్వం మూడు రాజధానుల విధానానికి స్వస్తి పలికి ఏకైక అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని ఈ సమావేశానికి హాజరైన రాజధాని గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజధాని ఉధ్యమ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా మహాపాదయాత్ర విధి, విధానాలు, నిర్వహణ కమిటీల ఏర్పాటు సహా పలు విషయాలపై చర్చించారు. తుళ్లూరు నుంచి తిరుమల తిరుపతి వరకు మొత్తం 45 రోజులపాటు పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు.

నవంబరు 1న మొదలయ్యే ఈ మహాపాదయాత్ర డిసెంబరు 17న ముగుస్తుంది. ఆ రోజు నాటికి ఉద్యమం ప్రారంభమై రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. మరోవైపు, రాజధానికి రైతులు ఇచ్చిన భూములకు ప్రభుత్వం వెంటనే కౌలు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మైనార్టీ, దళిత, యువజన జేఏసీ నాయకులు రాయపూడి సీడ్‌యాక్సెస్ రోడ్డు పక్కన ఉన్న ప్రజాప్రతినిధుల భవన సముదాయాల వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని విరమించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles