Purported video of MoS Ajay Kumar Mishra goes viral on net రైతులపై కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తీవ్ర వ్యాఖ్యలు..

Purported video of mos ajay kumar mishra surfaced on social media ahead of lakhimpur violence

video of MoS Ajay Kumar Mishra, Ajay Kumar Mishra on Farmers, Ajay Kumar Mishra comments on farmers, Ajay Kumar Mishra video oin social media, Lakhimpur violence, Ajay Kumar Mishra, Farmers, purported video, warning farmers, farmers protest, Lakhimpur Kheri, Uttar Pradesh, Politics

A purported video of Union Minister of State for Home Ajay Kumar Mishra in which he is heard warning agitating farmers that he would discipline them in “two minutes” appears to have angered farmers even before October 3rd violent clashes in Lakhimpur Kheri.

ITEMVIDEOS: రైతులపై కేంద్రమంత్రి తీవ్ర వ్యాఖ్యలు.. నెట్టింట్లో వీడియో వైరల్

Posted: 10/05/2021 10:46 AM IST
Purported video of mos ajay kumar mishra surfaced on social media ahead of lakhimpur violence

కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రా తనయుడు రైతుల నిరసన దీక్షలు చేస్తూ.. ఘెరావ్ చేయడంతో వారిని తన జీపుతో తొక్కేస్తూ ముందుకు వెళ్లడంతో నలుగురు రైతులు ఘటనాస్థలంలోనే మరణించిన విషయం తెలిసిందే. ఆదివారం రోజున తన సోంత నియోజకవర్గమైన లఖింపూర్ ఖేరీకి విచ్చేసిన మంత్రిని రైతలు అడ్డుకున్నారు. అంతుకు వారం రోజలు మందు ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన రైతులు ఆయనకు నిరసనలు వ్యక్తం చేశారు. అయితే జరిగిన పోరబాటును సరిదిద్దుకోవాల్సిన కేంద్రమంత్రి.. కేంద్రంతో తాను మాట్లాడతానని చెప్పి వెళ్లాల్సిన మంత్రి.. అవసరం అయితే క్షమాపణలు చెప్పాల్సింది పోయి.. వారిని తప్పించుకుని వెళ్లే క్రమంలో నలుగురి మరణానికి కారణమయ్యారు.

అయితే ఇంతకీ ఆయన అంతకుముందు చేసిన వ్యాఖ్యలు ఏమిటీ.? జై జవాన్, జై కిసాన్ అంటూ నినదించే దేశంలో ఆయన రైతులకు హెచ్చరికలు జారీ చేసేలా ప్రసంగించారు. తాను తలచుకుంటూ అంటూ మొదలుపెట్టి.. రైతలను టార్గెట్ గా మారారు. ఉన్నతమైన స్థాయిలో కొనసాగుతూ.. పుడమితల్లి ముద్దుబిడ్డపై కారాలు మిరియాలు నూరి.. తన పదవికే ప్రమాదాన్ని తెచ్చుకున్నారు. ఆయన ఏమన్నారంటే.. తాను కేంద్రమంత్రిని, పార్లమెంటు సభ్యుడిని కాకముందు తానేంటో ప్రజలకు తెలుసని, తాను తలచుకుంటే రైతులను దారిలో పెట్టేందుకు రెండు నిమిషాలు చాలంటూ హెచ్చరిస్తూ మాట్లాడారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ఖేరిలో ఆదివారం ఆయన పర్యటనను రైతులు అడ్డుకోవడానికి ఈ ప్రసంగమే కారణంగా తెలుస్తోంది. గత నెల 25న మంత్రి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖేరి నియోజకవర్గంలో పర్యటించారు. విషయం తెలిసిన రైతులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తాను తలచుకుంటే రైతులను దారిలో పెట్టేందుకు రెండు నిమిషాలకు మించి పట్టదని హెచ్చరించారు. తాను కనుక ఒక్కసారి సవాలును స్వీకరిస్తే వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ‘‘నేను రంగంలోకి దిగితే మీరు (రైతులు) పాలియా నుంచే కాదు, లిఖింపూర్‌ను కూడా వదిలిపారిపోతారు’’ అంటూ మంత్రి హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles