39 New Medicines Added To Essential List తగ్గనున్న క్యాన్సర్, టీబీ, మధుమేహ మందుల ధరలు..

39 new medicines added to essential list including tb and diabetics

health ministry, national list of essential medicines, pharma, essential drugs, national pharmaceutical pricing authority

As part of the planned price cap, the government amended the National List of Essential Drugs and added 39 new medicines to the list. In addition, some other medications used in COVID treatment along with anti-cancer, anti-diabetes, antiviral, antibacterial, antiretroviral, anti-TB drugs have had their prices cut.

తగ్గనున్న క్యాన్సర్, టీబీ, మధుమేహ మందుల ధరలు..

Posted: 09/06/2021 09:45 PM IST
39 new medicines added to essential list including tb and diabetics

క్యాన్సర్, మధుమేహం (షుగర్), టీబీ సహా వైరల్, బ్యాక్టీరియల్, రెట్రోవైరల్ రోగులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త అందించనుంది. ఈ వ్యాధులకు సంబంధించి మందుల కొనుగోలు చేయటం రోగులకు పెద్ద భారంగా మారింది. ఈ నేపధ్యంలో దీర్ఘకాలికంగా ఉపయోగించాల్సిన మందులు కావటంతో వీటిని తప్పనిసరిగా రోగులు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చవుతుండటం.. వాటిని కోనేందుకు పేదలు, మధ్యతరగతి ప్రజలు అనేక అగచాట్లు పడాల్సివస్తుందని గ్రహించిన కేంద్రం.. వారికి త్వరలోనే గుడ్ న్యూస్ ను అందించేందుకు సిద్దమైంది.

ఈ వ్యాధులతో పాటు మొత్తంగా 39 రకాల వ్యాధులతో బాదపడే వారు ఔషదాల కోనుగోలు కోసం.. తమ కుటుంబసభ్యుల ఆర్జనలో చాల మొత్తాన్ని ధారపోయాల్సి వస్తుందని కేంద్రం అర్థం చేసుకుంది.  వీటిని కొనుగోలు చేయలేక, రోజువారిగా  మందులు  సక్రమంగా వాడుకోలేని పరిస్ధితుల్లో కన్నుమూస్తున్నారన్న వివేదిక నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అందులో భఆగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల మందుల ధరలను తగ్గించాలన్న ఆలోచన చేస్తుంది. జాతీయ అత్యవసర ఔషదాల జాబితాను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సవరించనుంది.

ఔషద భారాల నుండి రోగులకు ఉపశమనం కలిగించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. కేన్సర్, టీబీ, షుగర్ వ్యాధుల చికిత్సలో భాగంగా వినియోగించే 39రకాల మందులు, టీకాల ధరలను త్వరలో తగ్గించనుంది. జాతీయ అత్యవసర ఔషదాల జాబితాలో చేర్చిన మందులను ఏధరకు విక్రయించాలన్నది ఎన్ పీపీఏ నిర్ణయిస్తుంది. ఎన్ ఎల్ ఇఎంలో 39 ఔషదాలను చేర్చనున్న ప్రభుత్వం మరో 16 ఔషదాలను జాబితా నుండి తొలగించాలని ప్రతిపాదించనుంది. ఎరిత్రోమైసిన్, బ్లీచింగ్ పౌడర్, ఎయిడ్స్ మందులు వంటివి ఈ తొలగించే జాబితాలు ఉన్నట్లు తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles