Suspected drones spotted at 3 places in Jammu region జమ్మూలో మరోసారి డ్రోన్ల కలకలం.. 3 ప్రాంతాల్లో సంచారం..

Jammu and kashmir suspected pakistani drones spotted at 3 locations in samba district

drone shot down, drone spotted, Jammu drone, Pakistani drones spotted, drone spotted jk 3 locations, Bari-Brahmana, Chiladya, Gagwal areas, Samba district, BSF, Drone activity in Jammu Kashmir, drone shot down in Jammu, Pakistan, Terror attack foiled, drone shot down, Jammu police, LIne of control, Jammu Kashmir

Suspected Pakistani drones were spotted hovering over three different locations in Samba district of Jammu and Kashmir, officials said on Thursday. The flying objects were sighted simultaneously over Bari-Brahmana, Chiladya and Gagwal areas around 8.30 pm on Thursday, the officials said.

జమ్మూలో మరోసారి డ్రోన్ల కలకలం.. 3 ప్రాంతాల్లో సంచారం..

Posted: 07/30/2021 01:40 PM IST
Jammu and kashmir suspected pakistani drones spotted at 3 locations in samba district

జమ్మూకశ్మీర్ లో మరోమారు డ్రోన్ సంచారం తీవ్రకలకలం రేపుతోంది. నెల రోజుల క్రితం డ్రోన్ సాయంతో భారత ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై దాడికి పాల్పడిన తరువాత పలుమార్లు డ్రోన్ల సాయంతో జమ్మూలోని పలు ప్రాంతాల్లో అలజడి సృష్టిస్తున్నాయి పాకిస్థాన్ ప్రేరేపిత ముష్కరమూకలు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం వారు వినియోగించిన ఓ డ్రోన్ పై భారత భద్రతా బలగాలు కాల్పులు జరిపి నేలకూల్చాయి. ఆ తరువాత వారం రోజుల వరకు ఎలాంటి డ్రోన్ ను వినియోగించని ఉగ్రమూకలు.. గతరాత్రి మాత్రం ఏకంగా ఏకకాలంలో జమ్మూకాశ్మీర్ లోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో డ్రోన్లతో మళ్లీ అలజడి సృష్టించాయి.

నెల రోజుల వ్యవధిలో పదకొండు డ్రోన్లను భారత్ లో సంచరించడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. జమ్మూకాశ్మీర్ లో సంచరిస్తున్న డ్రోన్లపై భారత భద్రతా బలగాలు దాడులు చేస్తున్నా.. బుద్ది తెచ్చుకోని ముష్కరమూకలు మరోమారు డ్రోన్లతో కలకలం సృష్టించాయి. తాజాగా జమ్మూకాశ్మీర్ లోని సాంబా జిల్లాలో గ‌త‌ రాత్రి ఏకంగా మూడు ప్రాంతాల్లో డ్రోన్లు సంచ‌రించ‌డం గ‌మ‌నార్హం. తొలి డ్రోన్‌ను బారి బ్ర‌హ్మ ప్రాంతంలో, రెండో డ్రోనును చ‌లియారి వ‌ద్ద గుర్తించిన‌ట్లు అధికారులు తెలిపారు. ఆ కాసేప‌టికే గ‌గ్వాల్ ప్రాంతంలో మూడో డ్రోనును గుర్తించిన‌ట్లు చెప్పారు.

జమ్మూలో సంచరిస్తున్న డ్రోన్లను గుర్తించిన వెంట‌నే కాల్పులు జ‌ర‌ప‌డంతో అవి తోక‌ముడిచాయి. డ్రోన్లు సంచ‌రించిన ప్రాంతాల్లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు త‌నిఖీలు చేశాయి. డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్ర‌గ్స్ వంటివి జార‌విడిచారా? అన్న విష‌యంపై భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అప్ర‌మత్త‌మ‌య్యాయి. డ్రోన్ల సంచారంతో సాంబా జిల్లాలో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. 2019 నుంచి పాక్ భార‌త్‌లోకి డ్రోన్ల ద్వారా పేలుడు ప‌దార్థాలు, డ్ర‌గ్స్ పంపే చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది. ఇక తాజాగా డ్రోన్ దాడులకు కూడా తెరలేపాయి.

దీంతో భద్రతా బలగాలు కూడా అప్రమత్తం అయ్యాయి. డ్రోన్ల‌ను రాడార్లు, యాంటీ డ్రోన్‌ సిస్టమ్స్ సాయంతో గుర్తించి పాక్ చ‌ర్య‌ల‌ను భార‌త సైన్యం తిప్పికొడుతోంది. కొన్ని డ్రోన్లు త‌ప్పించుకుని వెన‌క్కి వెళ్లిపోతున్నప్ప‌టికీ కొన్నింటిని మాత్రం భార‌త సైన్యం కూల్చేయ‌గ‌లుగుతోంది. డ్రోన్ల ద్వారా జ‌రిగే దాడుల‌ను ముందుగానే ప‌సిగ‌ట్టి తిప్పి కొట్టేందుకు ఏర్పాటు చేసుకుని అప్ర‌మ‌త్తంగా ఉంది. అయితే ఉగ్రవాదులకు పాకిస్థాన్ ప్రభుత్వ సహకారం పూర్తిగా లభిస్తోందని భారత అర్మీ వర్గాలు అరోపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles