Petrol price moves up further, no change in diesel rate మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర.. స్థిరంగా కొనసాగుతున్న డీజిల్ ధర

Petrol touches record high on july 17 breaches rs 108 litre in mumbai

Petrol Diesel prices, petrol diesel price hike, petrol prices in delhi, diesel prices in delhi, effect of covid 19 on petrol prices, effect of covid 19 on diesel prices, petrol price, petrol rate, petrol rate today India, diesel rate, diesel price, diesel rate today, diesel rate today in India, today petrol rate, today diesel rate, Petrol rate in Hyderabad, diesel rate in Telangana, diesel rate in Andhra Pradesh, diesel rate in Hyderabad, diesel rate in Guntur, diesel rate in Chennai, diesel rate in Vijayawada, diesel rate in Amaravati, diesel rate in Visakhapatnam, diesel rate in Delhi, diesel rate in Chennai, diesel rate in India, Petrol rate in Telangana, petrol rate in Andhra Pradesh, petrol rate in Delhi, petrol rate in Mumbai, Petrol rate in Hyderabad, Petrol rate in Visakhapatnam, fuel rates today in India, fuel rates, fuel price in India

After remaining unchanged for a day, petrol prices were hiked on Saturday, July 17, 2021, touching a record high across the country, adding more misery to the common man already grappling with rising food prices amid shrinking income. In the national capital, petrol price rose 30 paise.

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర.. స్థిరంగా కొనసాగుతున్న డీజిల్ ధర

Posted: 07/17/2021 01:35 PM IST
Petrol touches record high on july 17 breaches rs 108 litre in mumbai

డెబై ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఎన్నడూ ఎరుగని రీతిలో ఇంధన ధరలు పైపైకి ఎగబాగుతూ.. చరిత్రలో కొత్త శిఖరాలను అందుకుంటున్నాయి, చమురు ధరల పెంపుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని చె్ప్పిన కేంద్రం.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన మే 4 నుంచి వరుసగా ఇంథన దరలను పెంచూతూ వస్తోంది. ఫలితంగా దేశవ్యాప్తంగా అన్ని మెట్రో నగరాల్లో వంద రూపాయలు దాటిన ఇంధన ధర.. చారిత్రక గరిష్టాన్ని తాకింది. ఇంధన ధరలను చమురు కెంపెనీలు ఏకంగా మే నెలలో 16వ సారి ఇంధన ధరలను పెంచూతూ నిర్ణయం తీసుకున్నాయి. జూన్ నెలలో 16 సార్లు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. జూలైలో అప్పుడే పది పర్యాయాలు పెంచింది కేంద్రం.

అన్ లాక్ తరువాత క్రమంగా ఇంధన ధరలను పెంచుతూ వచ్చిన కేంద్రం తీరుతో దేశంలోని అనేక ప్రాంతాల్లో పెట్రోల్ ధర ఏకంగా రూ. 100 దాటింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్ ధరల 101.84 రూపాయలకు చేరువలో వుంది. దీంతో పాటు దాదాపుగా దేశంలోని అన్ని మెట్రోపాలిటిన్ నగరాలతో పాటు 13 రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.105ను మించి పరుగులు పెడుతొంది. దేశంలో ఈ ఇంధనం సరికొత్త ఎత్తును అందుకుని కోనసాగడం చారిత్రక గరిష్టంగానే చెప్పుకోవచ్చు. ఇక తాజాగా డీజిల్ దర కూడా వంద మార్కును అందుకునే దిశగా కదులుతోంది.  

ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెట్రోల్‌ లీటర్‌కు 30 పైసలు మేర పెంచిన ఇంధన సంస్థలు, డీజిల్‌ ధర ను మాత్రం స్థిరంగా కోనసాగించాయి. మే 4 నుంచి ఇప్పటివరకు చమురు ధరను 39 పర్యాయాలు పెంచిన కేంద్రం.. ఏకంగా అప్పట్నించి తాజా పెంపు వరకు పెట్రోల్ పై రూ.11.44, డీజిల్‌పై 9.14 వరకు చమరు కంపెనీలు పెంచాయి. ఫలితంగా పెట్రోల్-డీజిల్ ధరలు దేశంలో రికార్డు స్థాయికి చేరుకుంది. రాజస్థాన్ సహా మధ్యప్రదేశ్ రాష్ట్రాలోని పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర 110కి చేరుకోగా..  తెలుగు రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.107 దాటింది.

తాజాగా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా వున్నాయంటే...

ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 101.84గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.89.87కు చేరింది.
ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.107.84గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.97.45కు చేరింది.
చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.102.49గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 94.39కు చేరింది.
కొల్ కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.102.08గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.93.02కు చేరింది.
అమరావతి గుంటూరులో పెట్రోల్ ధర రూ..108.56 కాగా, లీటరు డీజిల్ ధర రూ.99.48కు చేరింది.
హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.105.823గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 97.96కు చేరింది.
బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర రూ.105.25గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.95.26కు చేరింది.
పాట్నాలో లీటరు పెట్రోల్ ధర రూ.104.22గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ. 95.94కు చేరింది.
చండీగఢ్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.97.61గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.89.35కు చేరింది.
లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ. 98.59గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.90.11కు చేరింది.
తిరువనంతపురంలో లీటరు పెట్రోల్ ధర రూ.103.47గా నమోదు కాగా, లీటరు డీజిల్‌ రూ.96.30కు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol  Diesel  fuel price  petrol price  diesel price  hyderabad  visakhapatnam  coronavirus  covid-19  

Other Articles