Coronavirus cases rise to 271 in India: ICMR భారత్ తో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు..

Coronavirus patients in india rise to 271 from 195 in a day

coronavirus in india, coronavirus, covid-19, corona positive case, covid-19 positive case, Indonesia, Telangana Health Ministry, Scotland, Hyderabad, Telangana, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

According to ICMR 271 individuals have been confirmed positive among suspected cases and contacts of known positive cases. However, health ministry said that novel coronavirus cases in India rose to 258 after many fresh cases were reported in various parts of the country.

భారత్ తో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు..

Posted: 03/21/2020 05:28 PM IST
Coronavirus patients in india rise to 271 from 195 in a day

ప్రపంచ దేశాలను తీవ్ర కలవరానికి గురిచేస్తున్న కరోనా వైరస్ నెమ్మదిగా భారత దేశంపై కూడా తన పంజా విసురుతోంది. దేశంలో మహరాష్ట్రలో అధ్యధిక కరోనా కేసులు నమోదు కాగా ఆ తరువాత ఈ జాబితాలో కేరళా రాష్ట్రం వుంది. ఇక ఇటు తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరిపోతుండడంతో భయాందోళనలు మొదలయ్యాయి. ఇవాళ తాజాగా అందిన గణాంకాల ప్రకారం దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 271కి చేరిందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ప్రకటన చేసింది.

కరోనా కారణంగా ఇప్పటివరకు దేశంలో మొత్తం నలుగురు మృతి చెందారని ఈ రోజు ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్‌, మహారాష్ట్రల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారని వివరించింది. కరోనా పాజిటివ్ అని తేలిన వారిలో 39 మంది విదేశీయులని తెలిపింది. కరోనా పాజిటివ్‌ అని తేలిన వారితో గతంలో కలిసున్న వారికి పరీక్షలు నిర్వహించాలని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) సూచించింది. కాగా, కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా రేపు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ సూచించిన విషయం తెలిసిందే.

ఇప్పటివరకు తెలంగాణలో ఆరు కేసులు పాజిటివ్ అని తేలగా.. నిన్న ఒక్కరోజే కేసులు డబుల్ అయ్యాయి. కాగా, తాజాగా మరో రెండు కేసులు పాజిటివ్ గా నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 21కి చేరింది. వీరితో ఒకరు 35ఏళ్ల యువకుడు. విదేశాల నుంచి వ్యక్తితో కలిసిన నేపథ్యంలో ఆయనకు ఈ వైరస్ సోకింది. ఇక మరో వ్యక్తి కూడా 33 ఏళ్ల యువకుడు కావడం గమనార్హం. అమెరికాలోని క్రూజ్ లో పనిచేస్తున్న సదరు యువకుడు దుబాయ్ మీదుగా హైదరాబాద్ కు చేరుకోగానే అతడ్ని అదుపులోకి తీసుకున్న సిబ్బంది క్వారంటైన్ కు తరలించి పరీక్షలు నిర్వహించగా, నివేదికలు ఆయనకు కరోనా సోకిందని నిర్థారణ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles