FIR against singer Kanika Kapoor బాలీవుడ్ గాయని కనిక కపూర్ పై నాలుగు కేసులు

Four firs against bollywood singer kanika kapoor

kanika kapoor, bollywood singer, coronavirus, four FIRs, UP Police, kanika kapoor fir, covid-19, uttar pradesh, coronavirus in india, corona positive case, covid-19 positive case, Indonesia, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus in tamil nadu, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

Four FIRS were lodged against Bollywood singer Kanika Kapoor, who had attended several programs in which many VIPs were present, before being tested positive for coronavirus. The singer has been charged with deliberately spreading infection and also violation of section 144 by attending parties.

బాలీవుడ్ గాయని కనిక కపూర్ పై నాలుగు కేసులు

Posted: 03/21/2020 06:53 PM IST
Four firs against bollywood singer kanika kapoor

కరోనా వైరస్ విషయంలో అత్యంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి పార్లమెంటు సభ్యులకే వైరన్ ను అంటించిందన్న ఆరోపణతో బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పదిరోజల క్రితం లండన్ నుంచి భారత్‌కు తిరిగొచ్చిన కనికా కనీస జాగ్రత్తలు పాటించకుండా మార్చి 13-15 తేదీల్లో లక్నోలో పలు ఈవెంట్లు నిర్వహించి సెలబ్రిటీలను ఎందరినో ఆహ్వానించినారు. తర్వాత ఆమె కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలడంతో ఆమె ఈవెంట్లకు హాజరైన సెలబ్రిటీలు, పార్లమెంటు సభ్యులు కూడా వణికిపోతున్నారు. దీంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు కనికాపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారు.

బాలీవుడ్‌ గాయని కనికాకపూర్‌ నిర్లక్ష్యంతో కరోనా భయాందోళనలు తాజాగా పార్లమెంటు దాకా పాకాయి. కనికా కపూర్‌ తనకు  కోవిడ్‌-19 (కరోనా) పాజిటివ్‌ అని తేలిందని, దీంతో తన కుటుంబం మొత్తం సెల్ఫ్‌ క్వారంటైన్ లోకి పోతున్నట్టు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో కరోనా తుట్టె కదిలింది. పలువురు ఎంపీలు సహా, కనికాతో కలిసిన, సన్నిహితంగా మెలిగిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లి పోవాల్సిన పరిస్థితి  ఏర్పడింది.  కనికాకపూర్‌ ఏర్పాటు చేసిన పార్టీకి రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె కుమారుడు బీజేపీ ఎంపీ దుష్యంత్‌ సింగ్ కూడా హాజరయ్యారు. దీంతో వారు హోం క్వారంటైన్‌ విధించుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

ఈ నేపథ్యంలో కనికా కపూర్ పై తీవ్రఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలన్న డిమాండ్లు ఊపందుకోవడంతో అమెపై నాలుగు కేసులు నమోదు చేశారు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు. నాలుగు రోజుల క్రితం మాత్రమే నాలో ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయని కనిక ఒక ప్రకటనలో తెలిపారు. నాకు సాధారణ ఫ్లూ మాత్రమే వచ్చిందని భావిస్తున్నాను. కానీ ఈ సమయంలో మనం విచక్షణకల పౌరులుగా మెలగాల్సి ఉందని, నిపుణులు, మన స్థానిక, కేంద్ర ప్రభుత్వాల ఆదేశాలను పాటించడం ద్వారా మాత్రమే మనం ఈ కరోనా భీతినుంచి బయటపడగలమని కరోనా సుద్దులు పలకడం నెటిజన్లను ఇంకా మండిస్తోంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles