Sun rays fall on feet of Suryanarayana Swamy మూలవిరాటుపై అరుణకిరణాలు.. భక్తుల కనువిందు..

Sun rays touch arasavalli deity for nine minutes

Visakhapatnam, uttarayanam, Srikakulam district, Devotees, arasavalli, Dwajasthambam, ‘gopuram’, Lord Sri Suryanarayana Swamy, Devotional

Hundreds of devotees had ‘darshan’ of Lord Sri Suryanarayana Swamy in the early hours on Tuesday when sun rays directly touched the presiding deity. The sun rays fell on the Dwajasthambam through the ‘gopuram’ of the temple and touched the God’s feet for nine minutes starting 6.21 a.m.

మూలవిరాటుపై అరుణకిరణాలు.. భక్తుల కనువిందు..

Posted: 03/09/2020 11:16 AM IST
Sun rays touch arasavalli deity for nine minutes

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యనారాయణస్వామి దేవాలయంలోని మూలవిరాట్టుపై అరుణకిరణాలు ప్రసురించాయి. ఈ అధ్భుతాన్ని తిలకించేందుకు వచ్చిన వేల సంఖ్యలో భక్తులు ఈ మహాద్భుత దృశ్యాన్ని చూస్తూ భగవాన్ నామస్మరణ చేస్తూ.. శ్రీ సూర్యనారాయణ భగవాన్ కి జై.. అంటూ నినదిస్తూ.. తన్మయత్వంలో పులకించారు. కన్నుల పండుగగా మారిన ఈ దృశ్యాన్ని భక్తులందరూ తిలకించేలా ఆలయకమిటీ ఏర్పాట్లు చేసింది. ఈ ఉదయం సూర్యోదయ శుభవేళ, ఈ అద్భుత సన్నివేశం జరిగింది.

ఇక స్వామివారు కూడా భక్తులందరికీ ఈ మహాద్భాగ్యం కలిగిలా ఇవాళ ఉదయం 6.21 గంటల నుంచి 6.30 గంటల వరకూ తొమ్మిది నిమిషాల పాటు తన సూర్యానారాయణ స్వామివారి మూలవిరాటుపై ఆదిత్యుని కిరణాల ప్రసారం చేస్తూ భక్తులను కనువిందు చేశారు. ప్రతి సంవత్సరమూ మార్చి 9, 10 తేదీల్లో సూర్య కిరణాలు స్వామివారిపై నేరుగా పడతాయన్న సంగతి తెలిసిందే. ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల్లో భాగంగా ఇది జరుగుతుంది. ఆ తరువాత ఈ ఏడాది అక్టోబర్ 1, 2 తేదీల్లోనూ ఇదే అద్భుతం గోచరిస్తుంది. దీన్ని తిలకించేందుకు గత రాత్రి నుంచే భక్తులు బారులు తీరారు.

ఏడాదిలో రెండు పర్యాయాలు ఈ అద్భుత సన్నివేశం చోటుచేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆలయానికి వేలాధి మంది భక్తులు తరలివస్తారు. స్వామివారిని సూర్య కిరణాలు తాకే అద్భుత దృశ్యాలను వీక్షించిన భక్తులకు ఆయురారోగ్యాలు సమకూరుతాయని.. ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా ఈ అద్భుతదృశ్యాన్ని చూసినంతనే రోగ విముక్తులు అవుతారని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో సరిగ్గా ఈ అద్భత ఘటనలు చోటుచేసుకునే ముందురోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. అద్భుత సన్నివేశాన్ని చూసిన తరువాత స్వామివారి దర్శనం చేసుకుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles