senior citizen orders beer @ Rs 25,000 online ఆన్ లైన్ లో బీర్.. డోర్ డెలివరీ కోసం ఆర్డర్..

Mumbai retired engineer orders beer online loses rs 25 000 to fraudster

Senior citizen beer, senior citizen online fraud, Retirerd engineer online beer, mumbai retd engineer Online fraud, mumbai retd engineer Beer, search engine, Mumbai police, Wine shop, QR code, Lokhandwala township, Kandivali, Samta Nagar police, fraudster, QR code, local wine shop, mumbai, Crime

A 64-year-old retired engineer ended up paying through his nose after he tried to order beer online from a local wine shop only to discover that a cyber fraudster siphoned off almost Rs 25,000 from his account, police said.

ఆన్ లైన్ లో బీర్.. డోర్ డెలివరీ కోసం ఆర్డర్..

Posted: 02/20/2020 04:39 PM IST
Mumbai retired engineer orders beer online loses rs 25 000 to fraudster

తనను అటకాయించి డబ్బు లాక్కునేందుకు ప్రయత్నించిన ఓ దొంగపై పంచుల వర్షం కురిపించిన బ్రిటన్ తాతయ్య వీడియో నెట్టింట్లో తాజాగా సంచలనంగా మారిన ఈ సమయంలోనే ముంబాయిలోని ఆరు పదుల వయస్సు దాటి నాలుగేళ్లు కావస్తున్న మరో తాతాయ్య మాత్రం తన ఓ దొంగ చేతిలో నిట్టనిలువునా వరుసగా రెండు పర్యాయాలు మోసపోయాడు. ఉద్యోగంలో వుండగా వీకెండ్ సరదాలను అలవాటు చేసుకున్నాడో ఏమోకానీ.. సరిగ్గా శనివారం రాత్రి ఆన్ లైన్ లో బీరు ఆర్డర్ చేసి చేతులు కాల్చుకున్నాడు.

క్షమాపణలకు లొంగిపోయిన తాతయ్య మరో్మారు కూడా ఇదే అనుభవాన్ని చవిచూసి.. తాను మోసపోయానని గ్రహించే లోపు తన అకౌంట్ నుంచి రూ.25వేలు పోయాయి. దీంతో లబోదిబోమంటూ స్థానిక మద్యం దుకాణాదారుల వద్దకు వెళ్లి వివరణ అడిగాడు. వారు చెప్పింది విని నిష్చేశ్టుడైన తాతయ్య ఏకంగా తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించాడు. అసలేం జరిగిందంటే.. స్విగ్గీ, జోమాటో, డున్జో తరహా అనేక ఫుడ్ డెలివరీ యాఫ్ ల మాదిరిగానే తనకు బీర్ ఇంటివద్దకే (డోర్ డెలివరీ) అందించే యాప్ లు ఉన్నాయా.. అంటూ నెట్టింట్లో సర్చ్ చేశారు.

ముంబయిలోని లోఖాండ్‌వాలా టౌన్ షిప్ లో నివాసం ఉండే 64 ఏళ్ల ఒక రిటైర్డ్ ఇంజనీర్‌ ఫిబ్రవరి 15వ తేది రాత్రి సమయంలో బీర్‌ ఆన్ లైన్‌ ఆర్డర్‌ ఇచ్చే ఉద్దేశంతో అంతర్జాలంలో వెతికాడు. సెర్చ్ ఇంజిన్‌ నుంచి అతనికి చరవాణికి సందేశం ద్వారా నాలుగు హెల్ప్ లైన్‌ నెంబర్లు వచ్చాయి. అవి లోకల్‌ వైన్‌ షాపుల నెంబర్లుగా భావించిన వృద్ధుడు వాటిలో ఒకదానికి కాల్‌ చేయగా రూ. 350 అడ్వాన్స్ గా చెల్లించాలన్నారు. అతడు సరే అనటంతో సైబర్ నేరగాడు అతని చరవాణికి క్యూఆర్‌ కోడ్ పంపించాడు.

సైబర్ నేరగాడి సూచనలతో ఆ క్యూఆర్ కోడ్‌ ద్వారా నగదు చెల్లింపు చేయగా.. తన అకౌంట్ నుంచి రూ.12,345 నగదు డెబిట్ అయ్యింది. నట్టుగా సందేశం వచ్చింది. ఇదేంటని ప్రశ్నిస్తే.. పొరపాటు జరిగిందని, డబ్బులు వెనక్కి పంపిస్తానంటూ మరో క్యూఆర్‌ కోడ్‌ పంపించాడు. అందులో నుంచి కూడా మరోసారి రూ.12,345 డెబిట్ అవడంతో బాధితుడు లబోదిబో అనకుంటూ లోకల్‌వైన్‌ షాపు వద్దకు వెళ్లి అడుగగా అది తమ చరవాణి నెంబరు కాదని, అసలు డోర్‌డెలివరీ సర్వీస్‌ లేదంటూ సమాధానం ఇచ్చారు. దీంతో  బాధితుడు స్థానిక సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Senior citizen  Retirerd engineer  Online fraud  Beer  search engine  Mumbai police  Wine shop  QR code  mumbai  Crime  

Other Articles