Amaravati stir continues on 65th day ఎమ్మెల్యే రోజాకు తగలిన రాజధాని సెగ

Mla rk roja feels the heat of amaravati protesters at srm university

Amaravati, RK Roja, APIIC chairperson RK Roja, Nagari MLA Roja, SRM University, Mangalagiri, AndhraPradesh Assembly, Amaravati, three capital, State Assembly, joint action committee, YS Jagan, ys jagan mohan reddy, chandrababu naidu, andhra pradesh capital, amaravati lands case, Vijayawada, farmers, Andhra Pradesh, Politics

Ruling YSR Congress Party MLA and APIIC chairperson RK Roja faced protests in Amaravati, when she went there to participate in a meeting at SRM University at Inovolu. Women staged a dharna outside the university entrance raising slogans against three capital plan.

అర్కే రోజాకు రాజధాని సెగ.. అడుగడుగునా నిరసనలు

Posted: 02/20/2020 03:43 PM IST
Mla rk roja feels the heat of amaravati protesters at srm university

అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా మార్చాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన నిరసన దీక్షలు ఇవాళ్టికి 65 రోజులకు చేరాయి. అమరావతిని శాసన రాజధానిగా మార్చి.. ఈ ప్రాంత రైతులు జీవితాలను, వారి భవిష్యత్ తరాల జీవితాలను అధోగతి పాలు చేయవద్దని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారాలన్న కొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వం ఆజ్యం పోయడం రాష్ట్ర భవిష్యత్ కు సహేతుకం కాదని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఈ పాంత్రానికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజాకు రాజధాని సెగ తగిలింది.

ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కార్యక్రమంలో పాల్గోనేందుకు వచ్చిన ఆమెకు అమరావతి రైతులు దారి పొడుగునా నిరసనలు తెలిపారు. గ్రామాల్లో అడుగడుగునా అమెకు చేదు అనుభవం ఎదురైంది. నేలపాడు ఎస్‌ఆర్ఎం యూనివర్సిటీ నుంచి గుంటూరు వైపు వెళ్తుండగా పెదపరిమి వద్ద చైర్ పర్సెన్ వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు. వాహనాన్ని ముందుకు వెళ్లనీయకుండా అడ్డుగా నిల్చున్నారు. రాజధాని మార్పుపై అమె సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు భారీగా చేరుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ ఉదయం నీరుకొండ ఎస్‌ఆర్ఎం యూనివర్సటీ సమ్మిట్ లో రోజా పాల్గొన్నారు. రోజా స్థానిక విశ్వవిద్యాలయానికి వచ్చిన విషయం తెలిసిన మహిళలు అక్కడకు చేరుకుని సమ్మిట్ బయట ఆందోళనకు దిగారు. అమరావతికి న్యాయం చేయాలంటూ మహిళలు నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రోజాను వెనుక గేటు నుంచి బయటకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న మహిళలు రోజా కాన్వాయ్ ను వెంబడించారు. వాహనం కదలనీయకుండా రైతులు రోడ్డుపై బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

రైతులను కించపరిచేవిధంగా వ్యాఖ్యలు చేసిన రోజా క్షమాపణలు చెప్పాలని మహిళలు డిమాండ్‌ చేశారు. ఆందోళనకారులు భారీగా చేరుకోవడంతో పోలీసులు రోజా వాహనం చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడ్డారు. ఆమె తన కారులోనే కూర్చుని ఆందోళనకారులను సెల్‌ ఫోన్‌లో చిత్రీకరించారు. దాదాపు 400 మంది పోలీసులు పెదపరిమి చేరుకుని రోజాకు రక్షణ వచ్చి అమెను గుంటూరుకు తీసుకెళ్లారు. గుంటూరు వెళ్లే మధ్యంలో పలు చోట్ల రోజా వాహనాన్ని అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles