Nirbhaya case: Delhi Court rejects Tihar Jail’s plea ‘నిర్భయ’ దోషుల ఉరిపై న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు

Nirbhaya case delhi court refuses to issue new death warrant rejects tihar jail s plea

Nirbhaya convicts, Execution date, Delhi Patiala Court, Tihar Jail authorities, Nirbhaya case convicts, Tihar jail, Nirbhaya convicts hanging, Nirbhaya case, Nirbhaya convicts mercy petition, Satish Kumar Arora, Supreme Court, Additional Registrar, deputation basis, nirbhaya murder case Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, Supreme Court, gang-rape, Mount Elizabeth Hospital, Tihar jail, Crime

A Delhi court dismissed a plea filed by Tihar jail authorities’ seeking fresh date for execution of the four death row convicts in the Nirbhaya gang rape and murder case. On February 5, the Delhi High Court gave the four convicts weeks’ time to exercise the legal rights available to them, after which the authorities should act.

‘నిర్భయ’ కేసు: దోషుల ఉరిపై న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు

Posted: 02/07/2020 05:59 PM IST
Nirbhaya case delhi court refuses to issue new death warrant rejects tihar jail s plea

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులకు శిక్ష ఎప్పుడు అమలువుతుందా.? అన్న ఉత్కంఠకు ఈ నెల 5న క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో దోషులకు వారం రోజుల సమయాన్ని ఇచ్చిన న్యాయస్థానం వారిని అన్ని న్యాయపరమైన హక్కులను వినియోగించుకోవాలని, న్యాయబద్దంగా వున్న అవకాశాలను వాడుకోవాలని సమయాన్ని కేటాయించింది. వారం రోజుల తరువాత తీహార్ జైలు అధికారులు తమ శిక్ష అమలు ప్రక్రియ అనుసారం వ్యవహరించాలని అదేశించిన విషయం తెలిసిందే.

కాగా నిర్భయ దోషులకు ఉరిశిక్ష అములుపర్చేందుకు కొత్త తేదీని కేటాయించాలని కోరుతూ మరోసారి తీహార్ జైలు అధికారులు ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. నిర్భయ కేసులో దోషులు వరుసగా పిటిషన్లు దాఖలు చేస్తూ ఉరితీత అమలును జాప్యం చేస్తున్న నేపథ్యంలో వారిపై డెత్ వారెంట్లు ఇప్పటికి రెండు పర్యాయాలు వాయిదా పడ్డాయి. తొలుత జనవరి 22న ఉరితీయాలనుకున్నా, అప్పటికి దోషుల పిటిషన్లతో సాధ్యం కాలేదు. ఆ తర్వాత ఫిబ్రవరి 1న ఉరికి సర్వం సిద్ధమైనా చివరి నిమిషంలో అదీ వాయిదాపడింది.

కాగా తీహార్ జైలు అధికారులు దాఖలు చేసిన పిటీషన్ ను ఢిల్లీలోని పటియాల న్యాయస్థానం తిరస్కరించింది. కాగా ఈ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. నిర్భయ కేసులోని దోషలు జీవించడానికి చట్టం అనుమతిస్తున్నప్పుడు.. వారిని ఉరి తీయాలని అనుకోవడం నేరపూరతిమైన పాపం అవుతుందని పేర్కోంది. ఇక ఈ కేసులోని దోషులకు వేర్వేరుగా ఉరి శిక్షను అమలుపర్చాలని కేంద్రం వేసిన పిటషన్ ను సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 11న విచారిస్తామని స్పష్టం చేసింది. ఈ పిటీషన్ ను విచారించేందుకు న్యాయస్థానం ఇవాళ పరిశీలించింది.

ఈ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ దేశసహనాన్ని పరీక్షించింది చాలు.. ఇక వారిని ఉరి తీసేందుకు అనుమతించాలని కోరారు. ఈ పిటిషన్‌ విచారణను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.భానుమతి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం పరిశీలిస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యాలు చేశారు. నలుగురు దోషుల్లో ఒకడైన పవన్‌ గుప్తా ఐదు సంవత్సరాలుగా క్షమాభిక్ష పిటిషన్‌ వేయకుండా ఉన్నాడని ఆయన ఆరోపించారు. కేంద్రం వేసిన పిటిషన్‌కు సంబంధించి నిర్భయ దోషులకు నోటీసులు జారీ చేయాలని మెహతా కోరగా అందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles