amaravati women gheraos sarada peeetadipati's convey స్వామి స్వరూపానందకు అమరావతి సెగ

Setback to sri swarupananda amaravati women gheraos sarada peeetadipati s convey

Swaroopananda Swamy, Sarada Peetadipathi, Gorantla Venkateshwara Swamy, women Gherao, CM Jagan, AP CM YS Jagan, YS Jagan on Amaravati, YS Jagan on Three Capitals, YS Jagan on capital decentralisation, Amaravati JAC, Mangalagiri, AndhraPradesh Assembly, Amaravati, three capital, State Assembly, joint action committee, YS Jagan, Capitals, Visakhapatnam, kurnool, committee report, executive capital, legislative capital, judicial capital, Vijayawada, farmers, Andhra Pradesh, Politics

The farmers of Amaravati blocked the popular spiritual saint, Sarada Peetadipathi Swaroopananda Swamy in Guntur over Capital issue. According to the sources, Swaroopananda Swamy visited Gorantla Venkateshwara Swamy fair on Friday and after getting the information, Amaravati women armers blocked his car and asked him to support Amaravati.

ITEMVIDEOS: శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందకు అమరావతి సెగ

Posted: 02/07/2020 05:06 PM IST
Setback to sri swarupananda amaravati women gheraos sarada peeetadipati s convey

అమరావతిలోనే పూర్తిస్థాయి రాజధానిని ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత రైతులు గత రెండు నెలలుగా నిరసన కార్యక్రమాలను చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్  ప్రభుత్వం వచ్చేందుకు పరోక్షంగా దోహదపడిన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామికి కూడా అమరావతి సెగ తగిలింది. గుంటూరు శివార్లలోని గోరంట్లలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాలకు స్వరూపానంద స్వామి ముఖ్య అతిథిగా హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో ఆయన వాహనాన్ని తెలుగు మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు.

ఆయన కాన్వాయ్ ను చుట్టముట్టిన తెలుగు మహిళలు కొంతసేపు వాహనాన్ని ఎటూ కదలనీయకుండా ఘెరావ్ చేశారు. ఈ సందర్బంగా కొందరు మహిళలు ఆయనకు అమరావతిలోని పరిస్థితిని వివరించారు. రాజధాని అమరావతి కోసం రైతులు, మహిళలు ఆందోళనలు చేస్తున్నారని ఆయనకు వివరించారు. పలువురు రైతులు ఇప్పటికే రాజధాని తరలివెళ్తోందని అందోళనకు గురై మనస్థాపంతో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించారని వివరించారు. యాగాలు చేసి జగన్ ను గెలిపించినట్లే.. అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా ఏదైనా యాగం చేయాలని కోరారు.

తెలుగు మహిళలు తన వాహనాన్ని ఘెరావ్ చేయడంతో పరాభవానికి లోనైన స్వరూపానంద స్వామి.. వారి మాటలకు సమాధానం ఇవ్వకుండానే స్వరూపానంద అక్కడి నుంచి ముందుకెళ్లారు. దీంతో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో అమరావతి కోసం పూజలు చేసిన స్వామి.. ఇప్పుడు రాజధాని మారుస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ విషయమై అడిగేందుకు వస్తే పోలీసులు నెట్టివేశారని, స్వరూపానంద కూడా తమను పట్టించుకోకుండా వెళ్లిపోయారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles