Kerala’s Maradu building comes crashing down క్షణాల్లో కుప్పకూలిన అక్రమ ఆకాశహార్మ్యాలు..

Kerala s maradu building comes crashing down in demolition drive

kerala building demolition, kerala building demolition case, kerala building demolition news, kerala building demolition latest news, kerala maradu building demolition, kerala maradu building demolition news, kerala maradu flat, kerala maradu flat demolition news, kerala maradu flat issue, kerala maradu flat latest news, National news, India news

H20 Holy Faith apartment became the first of the four residential apartments in Maradu, a neighborhood in Kerala’s Kochi, to be demolished. The apartment, which was razed as per a Supreme Court order passed last year, was brought down through controlled implosion

ITEMVIDEOS: అక్రమ ఆకాశహార్మ్యాలను క్షణాల్లో కుప్పకూల్చిన ప్రభుత్వం

Posted: 01/11/2020 06:11 PM IST
Kerala s maradu building comes crashing down in demolition drive

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తీర ప్రాంత నిబంధలను అతిక్రమించి నిర్మితమైన అక్రమ నిర్మాణాలపై ఎట్టకేలకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో భారీ స్థాయిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. నిబంధనలు ఉల్లంఘించి కోచిలోని మారడు ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టిన రెండు భారీ భవనాలను శనివారం ఉదయం నేలమట్టం చేశారు. ఇందుకోసం వందల కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించారు.

మారడు మున్సిపాలిటీలోని హెచ్‌20 హోలీ ఫేత్‌, ఆల్ఫా అపార్ట్‌మెంట్‌లను ఇవాళ కూల్చివేశారు. తొలుత హెచ్‌20 హోలీ ఫేత్‌ అపార్ట్‌మెంట్‌ను 11.18 నిమిషాలను కూల్చారు. కేవలం సెకన్ల వ్యవధిలోనే భవనం నేలమట్టమైంది. ఆ తర్వాత కాసేపటికే ఆల్ఫా కాంప్లెక్స్‌ను కూల్చారు. కూల్చివేతకు ముందు అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. పొరుగున్న ఉన్న భవనాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా వీటిని నేలమట్టం చేశారు.

అంతేగాక.. కూల్చివేత సమయంలో ప్రజలెవరూ అటు పక్కకు రాకుండా ఆంక్షలు విధించారు. 19 అంతస్తుల హెచ్‌20 హోలీ ఫేత్‌ అపార్ట్‌మెంట్‌లో 91 ఫ్లాట్లు ఉన్నాయి. 200 కిలోలకు పైగా పేలుడు పదార్థాలు ఉపయోగించి దీన్ని నేలమట్టం చేశారు. 17 అంతస్తుల ఆల్ఫా కాంప్లెక్స్‌లో 67 ఫ్లాట్లు ఉన్నాయి. తీర ప్రాంత నిబంధనలను ఉల్లంఘించి.. సరస్సును ఆనుకుని నిర్మించిన నాలుగు నివాస భవనాలను కూల్చివేయాలని గత సెప్టెంబరులో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో కేరళ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఈ రోజు రెండు భవనాలను నేలమట్టం చేశారు. ఆదివారం మరో రెండు భవనాలను కూల్చనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles