IAF Wing commander arrested for posing as Amit Shah స్నేహం కోసం అడ్డదారి.. కట్టకటాల్లోకి ఐఎఎఫ్ అధికారి

Iaf officer arrested for posing as amit shah over phone with mp governor

Governor Lalji Tandon, IAF Wing commander, Kuldeep Waghela, Chandresh Kumar Shukla, Amit Shah, University of Medical Sciences, Jabalpur, Madhya Pradesh

The Special Task Force (STF) of Madhya Pradesh Police has arrested a serving Air Force Wing Commander for impersonating as Union Home Minister Amit Shah over the phone and asking Madhya Pradesh Governor Lalji Tandon to appoint a friend as vice-chancellor of a university

స్నేహం కోసం అడ్డదారి.. కట్టకటాల్లోకి ఐఎఎఫ్ అధికారి

Posted: 01/11/2020 06:27 PM IST
Iaf officer arrested for posing as amit shah over phone with mp governor

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మాట్లాడుతున్నానంటూ మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్‌జీ టాండన్‌కు ఫోన్ చేసిన భారత వాయుసేన వింగ్ కమాండర్‌ను స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కథనం ప్రకారం.. వింగ్ కమాండర్ కుల్దీప్ బఘేలా.. గవర్నర్ కార్యాలయానికి ఫోన్ చేసి తాను అమిత్ షా పర్సనల్ అసిస్టెంట్‌నని, గవర్నర్‌కు ఫోన్ కలపాలని కోరాడు. గవర్నర్ లైన్ లోకి రాగానే.. తాను అమిత్ షాను మాట్లాడుతున్నానని గవర్నర్ తో సంభాషించాడు.

అయితే నేరుగా విషయంలోకి ఎంటరైన కుల్దీప్, డాక్టర్ చంద్రేశ్ కుమార్ శుక్లాను మెడికల్ సైన్సెస్ యూనివర్సిటీకి వైస్ చాన్స్‌లర్ గా నియమించాలని కోరాడు. కుల్దీప్ కు మంచి స్నేహితుడైన శుక్లాకు భోపాల్ లో డెంటల్ క్లినిక్ ఉంది. అమిత్‌ షాలా మాట్లాడి గవర్నర్ ను మోసం చేసిన వాఘేలాతోపాటు డాక్టర్ శుక్లాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరినీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. జబల్ పూర్లోని మధ్యప్రదేశ్ మెడికల్ సైన్సెస్ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్ నియామకం కోసం గతేడాది జూలైలో రాజ్ భవన్ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.
 
ఈ నెల 3న జరిగిన ఇంటర్వ్యూకు డాక్టర్ శుక్లా కూడా హాజరయ్యాడు. అయితే, రాజకీయ నాయకుల ద్వారా ఒత్తిడి తెచ్చి ఎలాగైనా వైస్ చాన్స్‌లర్ పోస్టులో కూర్చోవాలని కలలుగన్నాడు. ఇందులో భాగంగా తన స్నేహితుడైన వింగ్ కమాండర్ కుల్దీప్ వాఘేలాను కలిసి విషయం చెప్పాడు. దీంతో ఇద్దరూ కలిసి తప్పుడు కాల్ ద్వారా పని కానిచ్చేయాలని కుట్ర పన్నారు. అందులో భాగంగానే కుల్దీప్.. గవర్నర్ లాల్‌జీకి ఫోన్ చేసి శుక్లాను రికమెండ్ చేశాడు. అయితే, ఫోన్ కాల్ ను అనుమానించిన గవర్నర్ హోంమంత్రి కార్యాలయాన్ని సంప్రదించడంతో మోసం వెలుగు చూసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles