Sujana Chowdary explodes political bomb ‘బాంబు’ పేల్చిన బీజేపి ఎంపీ సజునా చౌదరీ

Sujana chowdary explodes political bomb in andhra pradesh

Sujana Chowdary political bomb, sujana chowdary TDP MLAs, sujana chowdary YCP mlas, sujana chowdary YCP MPs, Rajyasabha, YSRCP MLAs, YSRCP MPs, Chandrababu, TDP, MLAs, TDP, Andhra Pradesh, Politics

Rajya Sabha MP Sujana Chowdary said many YSRCP MLAs and MPs are in touch with the BJP and he also corrected the number of TDP MLAs in contact with him. "Not nine MLAs but 20 MLAs are in talks with us," added Sujana.

పొలిటికల్ ‘బాంబు’ పేల్చిన బీజేపి ఎంపీ సజునా చౌదరీ

Posted: 11/22/2019 11:30 AM IST
Sujana chowdary explodes political bomb in andhra pradesh

బీజేపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి రాష్ట్రంలో పొలిటికల్ బాంబు పేల్చారు. సుజనా వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీల ఎంపీలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. మరీ ముఖ్యంగా టీడీపీ దుకాణం పూర్తిగా ఖాళీ అవుతుందని, ఇన్నాళ్లు క్రమశిక్షణ గల పార్టీ అని, నాయకులను తయారు చేసే కర్మాగారమని చెప్పుకున్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో ఒంటరి కాబోతున్నారని తెలిపారు. అంతటితో ఆగని సుజనా రాష్ట్రంలోని అధికార పార్టీని కూడా అలర్ట్ చేశారు. ఇంతకీ ఆయన పేల్చిన రాజకీయ బాంబు ఏంటీ?

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపి పార్టీతో టచ్ లో వున్నారని తెలిపారు. ఈ క్రమంలో టీడీపీ చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారన్నారు. ఆ తరువాత తనకు తానుగానే ఆ సంఖ్యను సరిచేస్తూ టీడీపీలో మొత్తం 20 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని తెలిపారు. ఇక అధికార పార్టీ నుంచి కూడా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు.

అయితే తమతో టచ్ లో వున్నా.. ఎవరినీ ఇప్పటికిప్పుడు బీజేపీలో చేర్చుకోబోమని... సమయం, సందర్భం వచ్చినప్పుడే వారిని తమ పార్టీలో చేర్చుకుంటామని చెప్పారు. దీనికి తోడు పలువురు ఎమ్మెల్యేలు కూడా తమకు కొంత సమయం కావాలని కొరారని.. తగిన సమయంలో వారందరూ బీజేపిలో చేరుతారని ఆయన అన్నారు. పార్లమెంటులో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు భుజం మీద చేయి వేసి 'రాజు గారు' అంటూ ప్రధాని మోదీ పలకరించడంపై స్పందిస్తూ, నమస్కారం పెట్టిన వారికి ప్రతినమస్కారం చేయడం మోదీ సంస్కారమని సుజనా చౌదరి చెప్పారు.

ఇందులో చర్చించుకోవడానికి ఏమీ లేదని అన్నారు. దీనిపై రకరకాలుగా ఊహించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ నేతలతో ఎవరితో టచ్ లో ఉన్నారో తనకు తెలియదని సుజనా చౌదరి తెలిపారు. తనతో మాత్రం ఆయన టచ్ లో లేరని స్పష్టం చేశారు. ఇతర పార్టీలతో పొత్తుల కోసం తాము ఇప్పటి నుంచే వెంపర్లాడటం లేదని చెప్పారు. ఏపీలో అధికారాన్ని చేపట్టడానికి బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఏపీకి బీజేపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sujana Chowdary  Rajyasabha  YSRCP MLAs  YSRCP MPs  Chandrababu  TDP  MLAs  TDP  Andhra Pradesh  Politics  

Other Articles