Cop injured in a deadly sword attack by the youth హెడ్ కానిస్టేబుల్ పై కత్తులతో దాడి.. రాజమండ్రిలో రచ్చ..

Cop injured in a deadly sword attack by the youth in rajahmundry

Sword Attack, Rajahmundry, Special Branch Head constable, Nageshwar Rao, Sithanagaram, Korukonda police station, motorcycle number, Andhra Pradesh, Crime

In a most horrifying incident, a young guy attacked a Special Branch constable, which caused a stir in Rajahmundry in the East Godavari district. The youths attacked the constable and created ruckus on the roads with swords.

ITEMVIDEOS: హెడ్ కానిస్టేబుల్ పై కత్తులతో దాడి.. రాజమండ్రిలో రచ్చ..

Posted: 11/22/2019 12:24 PM IST
Cop injured in a deadly sword attack by the youth in rajahmundry

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పోకరీ యువకులు నడిరోడ్డుపై నానా రచ్చ చేశారు. తమ వాహనంతో ఎదురుగా వస్తున్న హెడ్ కానిస్టేబుల్ వాహనాన్ని ఢీకొనింది చాలక అతనిపై కత్తులతో దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆనందనగర్ అటో స్టాండు వద్ద ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంత జరుగుతున్నా యువకులను అడ్డుకునేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో వారితో పారాడిన హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వర రావుకు తీవ్రంగా గాయపడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే, స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ గా సీతానగరం, కోరుకొండ పోలిస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు.. పనిపై వెళ్తుండగా ఆనందనగర్ ఆటో స్టాండు వద్ద ఆయన మోటార్ సైకిల్ ను వెనుక నుంచి మరో మోటార్ బైక్ పై వచ్చిన ముగ్గురు యువకులు ఢీకొట్టారు. అయితే తప్పుదారిన అలా జరిగింది అని అంటారేమోనని కానిస్టేబుల్ వేచి చూశాడు. వారిలో ఎలాంటి తప్పు చేసిన పశ్చాతాపం లేదు. దీంతో నాగేశ్వరరావుకు అగ్రహం వచ్చింది. బైక్ పై ముగ్గురు రావడమే కాకుండా వాహనాన్ని ఢీకొన్న తరువాత కూడా అలానే వెళ్లడంతో వారికి జరిమానా విధించాలని భావించాడు.

దీంతో వారి బైక్ నంబర్ ను ఆయన సెల్ ఫోన్ లో ఫొటో తీసేందుకు సన్నధమయ్యారు. ఇంతలో నాగేశ్వరరావుతో ఆ ముగ్గురు యువకులు వాగ్వాదానికి. అంతటితో ఆగని యువకులు అతనితో తీవ్ర ఘర్షణకు దిగి.. దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో నాగేశ్వార రావు చోక్క చిరిగిపోయినా యువకులు శాంతించలేదు. ‘ మా బైక్ ఫోటోలే తీస్తావా’ అంటూ యువకులు నాగేశ్వర రావుతో వాగ్వాదానికి దిగారు. ఇంతటితో ఆ పోకిరాలు ఆగలేదు. నాగేశ్వరరావుపై దాడికి తెగబడ్డారు. ఆయనను కొట్టారు. కత్తులతో వీరంగం సృష్టించారు.

(Video Source: ETV Andhra Pradesh)

ఈ ఘటనతో అక్కడున్న స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ క్రమంలో స్థానికులు కొందరు అక్కడికి చేరుకోవడంతో యువకులు పరారయ్యారు. కాగా వారిలో ఒక్కడ్ని మాత్రం పట్టుకున్న నాగేశ్వరరావు.. జరిగిన ఘటనను పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, అక్కడకు చేరుకున్న త్రీటౌన్ పోలీసులు ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన యువకులు పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు... మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు. గాయపడ్డ నాగేశ్వరరావు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles