central funds on hold to telangana double bedroom houses తెలంగాణ సర్కార్ కు కేంద్రం షాక్.! పేదల ఇళ్ల నిర్మాణానికి నిధులు హుళ్ళక్కు.!

Central government funds on hold to telangana double bedroom houses

central government hold telangana funds, central funds to telangana, telangana double bedroom houses, double bedroom houses beneficiaries, Urban Housing scheme, central government, central funds, beneficiaries, double bedroom houses, telangana, BJP, Union Government, Telangana, politics

central government holds the funds to telangana double bedroom houses asking the state government to give the names of the beneficiaries.

తెలంగాణ సర్కార్ కు కేంద్రం షాక్.! పేదల ఇళ్ల నిర్మాణానికి నిధులు హుళ్ళక్కు.!

Posted: 11/16/2019 02:36 PM IST
Central government funds on hold to telangana double bedroom houses

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో కేంద్రం షాక్ ఇచ్చింది. బీజేపి, కాంగ్రెస్ ఫ్రభుత్వాలు గతంలో మంజూరు చేసిన అగ్గిపెట్టల్లాంటి ఇళ్ల నిర్మాణాలను కాకుండా పేదలు కూడా హుందాగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో కాపురం చేయాలని యోచించిందీ తెలంగాణ సర్కార్. అందుకోసం తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం గదులను నిర్మిస్తోంది. అయితే అనేక ప్రాంతాల్లో ఇళ్లు నిర్మాణాలు రమారమి పూర్తి దశకు కూడా చేరుకున్నాయి.

అయితే ఇక్కడే కేంద్ర ప్రభుత్వం షాక్ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా తగిలింది. ఈ పథకంలో భాగంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం విధిల్చడం లేదని చెబుతోంది. కేంద్రం నుంచి గతంలో అందిన తొలి విడుత నిధులు మినహాయిస్తే ఇప్పటి వరకు రెండు, మూడు దశల కింద రావాల్సిన నిధులు ఇంకా విడుదల కాలేదు.  ఈ రెండు విడదల నిదులు కలపి మొత్తంగా రూ.1800 కోట్ల నిధులు విడుదల చేసేందుకు కేంద్ర కోర్రీలు పెడుతోందని సమాచారం. 8 నెలలుగా నిధుల కోసం అభ్యర్థిస్తున్నా ఇచ్చేది లేదని తెగేసి చెబుతోంది.

అయితే ఆ కొర్రీలో కూడా బలమైన పాయింట్ వుందని కాషాయ పార్టీ నేతలు అభిప్రాయపడతున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారుల జాబితా ఇస్తేనే నిధులు ఇస్తామని కేంద్రం ఖరాఖండీగా చెబుతోంది. దీంతో నిర్మాణ దశలో ఉండగానే లబ్దిదారులను ఎంపిక చేస్తే అది అనవసర సమస్యలకు కారణంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక దీనికి జాబితాను అప్పుడే విడుదల చేస్తే.. లబ్దిదారుల ప్రయోజనాల కన్నా.. వాటిని అందుకోలేకపోయిన వారిలో నిరుత్సాహం, అసంతృప్తి పెల్లుబిక్కుతుందని దీంతో రాజకీయాంగానే తమకు నష్టం వాటిల్లనుందని గులాభి నేతలు వాదిస్తున్నారు.

దీనికి తోడు లబ్దిదారుల ఎంపిక ముందుగానే చేపట్టడం ద్వారా అన్ని వర్గాల ప్రజల నుంచి రాజకీయ ఒత్తిళ్లకు కూడా కారణం అవుతోందని అభిప్రాయాలు వినబడుతున్నాయి. తమ ప్రభుత్వం పేదల కోసం తీసుకువచ్చిన బృహత్తర పథకం కాస్తా విమర్శలు, సమస్యలతో అప్రయోజనంగా మారే అవకాశం వుంటుందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. తొలి విడుదల నిధులకు ఎలాంటి కొరివి పెట్టకుండా విడుదల చేసిన కేంద్రం.. రెండు మూడవ విడదల నిధులను మంజూరు చేయడంలో ఎందుకు కొర్రీలు పెడుతోందని మండిపడుతున్నారు.

నిజానికి ఒక్కో డబుల్ బెడ్రూం ఇంటికి దాదాపు రూ. 9 లక్షలు ఖర్చవుతుండగా, కేంద్రం తన వంతుగా లక్షన్నర రూపాయలు ఇస్తోంది. ఈ లెక్కన జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న లక్ష ఇళ్లకు కేంద్రం నుంచి ఇంకా రూ.1500 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో మొదటి విడత కింద రూ.600 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ఇంకా రూ.900 కోట్లతోపాటు ఇతర జిల్లాలో నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించి మరో రూ.900 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడీ నిధుల విడుదల విషయంలో కొర్రీలు పెడుతూ లబ్ధిదారుల జాబితాను తీసుకురమ్మని చెబుతోంది. ఆ జాబితా ఇస్తేనే నిధుల విడుదల గురించి ఆలోచిస్తామని తేల్చి చెప్పడంతో ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles