HC gives clearance to local body elections స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్.. హైకోర్టు పచ్చజెండా

Andhra pradesh high court gives clearance to local body elections

andhra pradesh local body elections, local body elections high court, local body elections clearance, local body elections 50 percent quota, local body elections high court bench, local body elections, High court, petition, clearance, AP Govt Cheif Secretary, andhra pradesh, politics

The Andhra pradesh High Court dismisses the petition filed against staying the local body elections in the state until the 50 percent quota case is cleared.

స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్..

Posted: 11/16/2019 03:14 PM IST
Andhra pradesh high court gives clearance to local body elections

ఆందప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ఎన్నికల నిర్వహణకు గత కొన్ని నెలలుగా హైకోర్టులో నానుతున్న పిటీషన్ ను రాష్ట్రోన్నత న్యాయస్థాన ధర్మాసనం కోట్టివేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ లకు త్వరలో నగరా మ్రోగననుంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థల కాలపరిమితి ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. తాజాగా, గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించేందుకు మరోమారు హైకోర్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన అదేశాలు లభించాయి. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గతేడాది అక్టోబరులో ఉమ్మడి హైకోర్టు ఆదేశించినా ఆ అదేశాలు ఇంత వరకు అమలుకు నోచుకోలేదు.

ఆ ప్రక్రియను నిలువరించలేమని న్యాయస్థానం తేల్చిచెప్పింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం దాటేందుకు వీలు కల్పించే ఏపీ పంచాయతీరాజ్‌ చట్టంలోని పలు సెక్షన్లు రద్దుచేయాలని కోరుతూ గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన నవీన్‌కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ శ్యాంప్రసాద్ లతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం.. దీనిపై తీర్పు వచ్చేవరకు ఎన్నికలు నిలువరించాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖతోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు కూడా నోటీసులు జారీచేసింది.

నవీన్ కుమార్‌ తరఫున న్యాయవాది ఓ.మనోహర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదని డాక్టర్‌ కె.కృష్ణమూర్తి కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని అన్నారు. ప్రస్తుత చట్టంలో సెక్షన్లు దానికి విరుద్ధంగా ఉన్నందున ఎన్నికలు నిలుపుదల చేయాలని కోరారు. ప్రభుత్వ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల ప్రక్రియను కొనసాగినివ్వాలని కోరారు. పూర్తి వివరాలతో అఫిడ్‌విట్ దాఖలు చేయడానికి కొంత సమయం ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదావేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles