Honey trap gang held in kakinada ఏపీలో హనీట్రాప్: మగువను చూపించి రూ.25 లక్షలు...

Police arrested honey trap gang in east godavari

honey trap in samralakota, honey trap in kakinada, honey trap in east godavari, honey trap accused held, honey trap, samarlakota, kakinada, east godavari, andhra pradesh, Crime

Honeytrap emerged in Samarlakota near kakinada of East godavari district. A gang trapped a Financier and blackmailed for Rs 25 Lakhs. After a complaint from the victim police arrested 7 members gang from in the district, while they are distributing money.

సామర్లకోటలో హనీట్రాప్: మగువను చూపించి రూ.25 లక్షలు...

Posted: 11/16/2019 11:49 AM IST
Police arrested honey trap gang in east godavari

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నతస్థాయి అధికారులు, బ్యూరోక్రాట్ల నుంచి రాజకీయ నేతల వరకు ఎందరి గుట్టునో పట్టుకుని వారి నుంచి అందినకాడికి డబ్బులు గుంజడంతో పాటు వారి చేత అక్రమంగా ఎన్నో పనులు కూడా చేయించుకున్న హనీట్రాప్ గ్యాంగ్ ఉచ్చు వెలుగుచూసిన నేపథ్యంలో అదే పంథాను వినియోగించుకుని తన భూ వివాదాన్ని పరిష్కరించుకోవాలని ప్రయత్నించిన ఓ ఘనుడితో పాటు అతను చెప్పిందల్లా చేసిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిలను ఎరగా వేసి లక్షలాది రూపాయలు గుంజేందుకు ప్రయత్నించిన ఏడుగురు సభ్యుల ముఠా సామర్లకోట పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తోంది.

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఈ నెల ఏడో తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జి.మామిడాడకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి తాడి కేదార మణికంఠరెడ్డికి.. స్థానికంగా జై ఆంధ్రా చానల్ నిర్వహిస్తున్న తేతలి దుర్గారెడ్డి అనే ఇద్దరు స్నేహితులు. అయితే వీరిద్దరి మధ్య ఓ స్థల వివాదం ఏర్పడి.. అది కాస్తా వారి మధ్య వైరానికి దారి తీసింది. అయితే ఈ సమస్యను సక్రమంగా పరిష్కరించుకునే క్రమంలో ఏళ్లు పడుతుందని యోచించిన దుర్గారెడ్డి.. మణికంఠరెడ్డిని ఎలాగైనా లొబర్చుకోవాలని వక్రంగా ఆలోచించాడు.

తన చానల్ లో పనిచేస్తున్న రాకేశ్ అనే వ్యక్తి సాయంతో మహేశ్, అశ్విని అనే భార్యభర్తలను రంగంలోకి దింపాడు. అశ్వని సహకారంతో హనీట్రాప్ చేయాలని పథకం రచించారు. మడికి అశోక్ అనే వ్యక్తి ఇంటికి కేదార మణికంఠ రెడ్డిని అశ్వినీ ద్వారా రప్పించాలనుకున్నారు. ఈ క్రమంలో మణికంఠరెడ్డికి ఫోన్ చేసిన అశ్విని మాయమాటలతో అశోక్ ఇంటికి అతడిని రప్పించింది. అమె మాయమాటలకు లొంగిపోయిన కేదార మణికంఠరెడ్డి అశోక్ ఇంటికి వెళ్లాడు. తనకు ఫోన్ చేసింది తానేనన మణికంఠరెడ్డికి ఎదురుగా వచ్చిన అశ్విని.. అతడ్ని గదిలోకి తీసుకెళ్లింది. వారు వెళ్లిన మరుక్షణం అక్కడే కాపుకాసిన బ్లాక్ మెయిల్ ముఠా.. వారి వీడియో తీసింది.

ఇక వెంటనే రంగంలోకి దిగిన ముఠాసభ్యులు.. కేదార మణికంఠరెడ్డికి వీడియోలు చూపించి లోంగదీసుకోవాలని ప్రయత్నించినా.. అది కుదరలేదు. అతను అదరలేదు.. బెదరలేదు.. దీంతో ఇక లాభం లేదన్నకున్న ముఠా మణికంఠరెడ్డిని నిర్భందించింది. అక్కడే కుర్చీకి కట్టేసిన ముఠా సభ్యులు అతడ్ని చిత్రహింసలకు గురిచేసి రూ.25 లక్షలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో అతడి వీడియోలు బయటపెడతామని బెదిరించారు. దీంతో మణికంఠరెడ్డి రూ.50 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనికి సరేనన్న ముఠా సభ్యులు.. కేదార్ వద్ద ఉన్న రూ.63 వేల నగదు, బంగారు ఆభరణాలు లాక్కుని తెల్లకాగితాలపై సంతకాలు, వేలిముద్రలు తీసుకుని పరారయ్యారు.

జరిగిన ఘటనపై తీవ్ర మనోవేదనకు గురైన కేదార మణికంఠారెడ్డి.. తనకు ఎదురైన పరిణామాలన్నింటినీ అనుమానించి పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్యంత చాకచక్యంగా వారం రోజులు తిరగకుండానే ముఠా సభ్యులను కటకటాల వెనక్కి పంపారు. ఈనెల 14న ఇంద్రపాలెంలో ఒక ఇంటిలో ఉన్న నిందితులు ఆరుగుళ్ల మహేష్, భూరి అశ్విని, నిమ్మకాయల సతీష్, తోట సందీప్, బొడ్డుపు రాజేష్‌కుమార్, ఎలుడుట్టి లక్ష్మీనారాయణ, మడికి అశోక్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాన్ని వారు అంగీకరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన దుర్గారెడ్డి, రాకేష్‌ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : honey trap  samarlakota  kakinada  east godavari  andhra pradesh  Crime  

Other Articles