Florida wedding: Bride in bikini and groom in overalls ద్యేవుడా..! ఇదేం తంతో.. బికినీలో పెళ్లి.. బురదలో ముద్దులు

Bride in bikini and groom in overalls roll in mud to end florida wedding

Ahrielle Jeremy Biddle wedding, bride wedding dress, white veil with matching bikini, florida, pickup truck, wedding, messy marriage, mud, roll, marriage, punta gorda, bride, bikini, groom, wierd news, viral video, video viral

A couple tied the knot on a pickup truck in Punta Gorda, Florida, on March 23, before rolling in mud. The bride wore a white bikini and veil to wed her new husband at the Redneck Mud Park. The groom carried his new wife into the mud.

ITEMVIDEOS: ద్యేవుడా..! ఇదేం తంతో.. బికినీలో పెళ్లి.. బురదలో ముద్దులు

Posted: 04/02/2019 07:00 PM IST
Bride in bikini and groom in overalls roll in mud to end florida wedding

పిచ్చి పలు రకాలు అని అంటుంటారు. అయితే ఇప్పటి వరకు వివాహ వేడుకలను కూడా చాలా మంది తమకున్న కోరికానుసారం పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే అందరిలా ఎందుకు అనుకున్నారో.. లేక తమకంటూ ఓ వినూత్నత వుండాలని భావించారో కానీ ఓ జంట వింత పద్ధతిలో వివాహం చేసుకున్నారు. పెళ్లంటే సంప్రదాయబద్దంగా చేసుకోవాల్సిన కార్యక్రమాన్ని.. సరదా తంతుగా మార్చేశారు. వీరి పెళ్లికి సంబంధించిన తంతు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ప్లోరిడాలోని ఓ జంట వివాహం వినూత్నంగా, వింత పద్దతిలో జరగడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. పిక్ అప్ ట్రాక్కుపై తమ పెళ్లి పందిని డిజైన్ చేసుకున్న ఈ జోడి.. దాని వెనుకున్న భాగంలో నిలబడి క్రిస్టియన్ ఆచారం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఇందులో అంత విశేషమేముంది అంటారా.? ఆగండాగండీ.. ఈ పెళ్లి విశేషాల్లో అది కేవలం న్యూస్ రీల్ మాత్రమే. అసలు సినిమా ఏంటో తెలిస్తే మీరు కూడా ముక్కుమీద వేలేసుకుంటారు.
 
రెండు జీవితాలను ముడివేసే వివాహమంటే.. పెళ్లి కూతురు తన సంప్రదాయాల ప్రకారం ముస్తాబవుతుంది. క్రైస్తవ ఆచారం ప్రకారం తెల్లని గౌను ధరించి.. తెల్లని టోపి.. తెల్లని బూట్లు అలా చూస్తే మొత్తంగా శ్వేతవర్ణంలోని నిండుగా ముస్తాబైన రాణిలా మెరుస్తుంది. కానీ మనం చెప్పుకునే ఈ పెళ్లి కూతురు మాత్రం బికినీ వేసుకొని ఉంది. మరోపక్క పెళ్లి కొడుకు తక్కువ తినలేదండోయ్..పెళ్లి కొడుకు కూడా షర్ట్ వేసుకోకుండానే పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు.
 
బికినీలో ఉన్న పెళ్లి కూతురిని వివాహమాడి, ఆమెను మినీ ఆటో నుంచి కిందికి అపురూపంగా దించాడు. ఆ తర్వాత ఇంకాస్త అపురూపంగా ఎత్తుకుని ముద్దులు కూడా పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమెను తీసుకెళ్లి ఓ బురదగుంటలో పడేసాడు. తను కూడా బురదగుంటలో దూకేసి..ఆమెను ముద్దులతో ముంచెత్తాడు. ఈ వింత వివాహానికి హాజరైన వారి మిత్రులు ఈ చిత్రాలను కెమెరాల్లో బంధించారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పటికే దాదాపు లక్షమంది దీనిని షేర్ చేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : florida  pickup truck  wedding  messy marriage  punta gorda  bride  bikini  groom  wierd news  viral video  

Other Articles