High Court adjourns EVM, VVPAT case to Feb 7th ఈవీఎం, వీవీఫ్యాట్ లపై విచారణ ఫిబ్రవరి 7కు వాయిదా..

Ladagapati rajagopal suspects elements on scantity of his survey

Ladagapati RajaGopal, survey, Exit polls, Election commision, High Court, voting percentage, chief election officer, malreddy rangareddy, Evms, Electronic Voting Machines, VVPAT Machines, EVM hacking, EVM tampering, VVPAT slips counting, Kapil Sibal, Advocate, Telangana government, Politics

Former MP Ladagapati RajaGopal says the scantity of his survey never goes missing, but in telangana he suspects some elements which led to go wrong.

తెలంగాణ ఫలితాల అంచనాలపై మళ్లీ లగడపాటి రగడ..

Posted: 01/30/2019 05:20 PM IST
Ladagapati rajagopal suspects elements on scantity of his survey

గతేడాది డిసెంబర్ 7న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత తాను వెల్లడించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో మహాకూటమి పార్టీలు అధికారంలోకి వస్తాయని చెప్పిన ఒకే ఒక్కరు మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్. అయితే ఫలితాలు వెల్లడైన తరువాత అంతా తారుమైందని, నెట్ జనులు లగడపాటిని సోషల్ మీడియా వేదికగా ఆట ఆడుకున్నారు. ఈ క్రమంలో దాదాపుగా నలభై ఐదు రోజుల తరువాత ఏకంగా హస్తినలో మీడియా ముందుకు వచ్చిన లగడపాటి రాజగోపాల్ ఆయన తన వెలువరించిన సర్వే నివేదికలను తప్పబట్టాల్సిన అవసరం లేదని అన్నారు.

డిసెంబర్ 7న పోలింగ్ ముగిసిన తరువాత పొలింగ్ ఎంతమేరకు జరిగిందన్న విషయంలో ఎన్నికల అధికారులు ఎందుకంత ఆలస్యంగా రాష్ట్రంలోని ఓటింగ్ శాతాన్ని వెలువరించారో చెప్పాలని అర్థం కావడం లేదని అన్నారు. ఎలక్ట్రానిక్ యుగంలో ఓటింగ్ శాతాన్ని చెప్పడానికే ఈసీ అధికారులు తీసుకున్న సమయం.. ఎందుకంతగా పెరిగిపోయిందో చెప్పాల్సిన అవసరం వుందని అన్నారు.

ఇక తొలుత 67శాతం వున్న ఓటింగ్ శాతం తరువాత రోజుకు 73.2 కు వెళ్లిందని, ఎన్నికల సమయం ముగిసిన తరువాత దాదాపుగా 6.2శాతం ఓటింగ్ జరిగిందని, అయితే ఏయే గంటకు ఎంతమేరకు ఓటింగ్ జరిగిందో కూడా చెప్పాల్సిన బాధ్యత ఈసీ అధికారులపై వుందని లగడపాటి అన్నారు. ఈ విషయంలో ప్రజల్లో పలు అనుమానాలు వున్నాయని వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం మాత్రం ఎన్నికల సంఘం అధికారులతో పాటు ప్రభుత్వాలపైనే వుందని అన్నారు.

కాగా, బీఎస్సీ పార్టీ తరపున ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన మల్ రెడ్డి రంగారెడ్డి ఎన్నికల లెక్కింపులో అవకతవకలు జరిగాయని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టును అశ్రయించగా, విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈ నెల 30న సమగ్ర సమాచారంతో న్యాయస్థానంలో హాజరుకావాలని హైకోర్టు రాష్ట్ర ఎన్నికల అధికారులకు అదేశించింది. అయితే ఇవాళ కేసును న్యాయస్థానం వచ్చే నెల 7కు వాయిదా వేసింది.

ఇక మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంగా అతిపెద్ద దేశమైన భారత్ లో ప్రజాస్వామ్యాం మరింత పరఢవిల్లాలంటే.. ఎన్నికల కౌంటింగ్ ను వీవీ ప్యాట్ స్లిపులతోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. తన విషయంలో రెండు ఈవీఎం యంత్రాలకు.. వీవీ ప్యాట్ స్లిపులకు మధ్య 30 ఓట్ల వత్యాసం వచ్చిందని అలాంటిది మూడు నుంచి నాలుగు వందల ఈవీఎంలతో ఎంత వ్యత్యాసం వస్తుందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. ప్రజాధనంతో ఎన్నికలు నిర్వహిస్తున్న క్రమంలో ప్రజల ఓటుకు కూడా మరింత జవాబుదారి తనం కల్పించేందుకు వీవీప్యాట్ స్లిపులతోనే కౌంటింగ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ladagapati RajaGopal  survey  Exit polls  Election commision  High Court  voting percentage  Politics  

Other Articles