fake baba arrested on sexual harrasment నగ్నంగా వుంటేనే తాయత్తు కడతానన్న బాబా అరెస్టు

Godman arrested for allegedly sexually assaulting woman in andhra

Jaggayyapeta police, self-proclaimed god-man, Bilal, sexual harrased, married women, Krishna district, Andhra Pradesh, crime

Jaggayyapeta police arrested on a self-proclaimed god-man identified as Bilal, who sexual harrased a married women in Jaggayyapeta town in Krishna district, after he was approached by a woman for help as her husband was unwell.

ఆరుబయట భర్త.. లోపల భార్యపై అత్యాచారయత్నం..

Posted: 01/30/2019 06:44 PM IST
Godman arrested for allegedly sexually assaulting woman in andhra

మంత్రాలకు చింతకాయలు రాలవని పెద్దవాళ్లు అనేక సందర్బాల్లో చెప్పినా.. మనవాళ్లు కారుచౌకగా చికిత్స జరిగిపోతుందని నమ్మి వాళ్లను ఆశ్రయిస్తారు. ఇలా అశ్రయించిన భక్తులనే తమకు ఖజానాగా మార్చుకునే మేకవన్నెపులులు.. వారిపై అఘాయిత్యాలకు తెగబడతారు. ఇలాంటి ఘటనే కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జరిగింది. ఆరుభయట అత్తా, భర్తలు వున్నా.. లోపల మాత్రం అమెపై నరకం అనుభవించింది.

ఎట్టకేలకు కామాంధుడి చెర నుంచి తప్పించుకోచ్చిన అమె.. రెండు రోజుల తరువాత అత్తతో కలసి పోలీసులను అశ్రయించింది. దీంతో పోలీసులు మంత్రగాడిపై కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. భర్తకు ఆరోగ్యం బాగోలేదని బిలాల్ బాబా అనే వ్యక్తి ఆశ్రయించింది ఓ మహిళ. దీన్ని ఆసరాగా చేసుకున్న ఆ దొంగ బాబా... తాయత్తు కట్టాలి రమ్మంటూ కొద్ది రోజుల క్రితం ఆ మహిళ, ఆమె భర్తను తన దగ్గరకు పిలిపించుకున్నాడు.

భర్తకు ఊది పొగ వేసి బయటే ఉండమన్న దొంగ బాబా... అతడి భార్యకు తాయత్తు కట్టాలంటూ ఓ గదిలోకి తీసుకెళ్లాడు. తాను తాయత్తు కట్టాలంటే నగ్నంగా ఉండాలని ఆమెకు తెలిపాడు. ఇందుకు ఆ మహిళ నిరాకరించడంతో ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. దొంగ బాబా ఆకృత్యాలను రెండు రోజుల పాటు ఎవరికీ చెప్పకుండా కుమిలిపోయిన ఆ మహిళ... ఎట్టకేలకు తన అత్త సహకారంతో పోలీసులను ఆశ్రయించింది. బిలాల్ బాబాను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles