Fire breaks out in IT company, no casualties బషీర్ బాగ్ బహుళ అంతస్థు భవనంలో అగ్నిప్రమాదం

Fire breaks out in khan lateef khan building in hyderabad

Fire Accident in Basheerbagh, Fire Accident in Khan Lateef Khan Building, Fire Accident in Hyderabad, Fire Accident in Telangana, Fire Accident, Basheerbagh, hyderabad, Telangana, Crime

A major fire broke out at an IT firm located in Basheerbagh area of Hyderabad. No casualties have been reported till now. According to Viswa Prasad, DCP, Central Zone, "The fire broke out at the fifth floor of the Khan Lateef Khan building.

బషీర్ బాగ్ బహుళ అంతస్థు భవనంలో అగ్నిప్రమాదం

Posted: 01/23/2019 05:42 PM IST
Fire breaks out in khan lateef khan building in hyderabad

హైదరాబాద్ బషీర్ బాగ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం లాల్ బహదూర్ స్టేడియం సమీపంలో ఉన్న ఖాన్ లతీఫ్ ఖాన్ భవనంలోని ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ భవనంలో అధికంగా ఐటీ, సాప్ట్ వేర్ పరిశ్రమలే వున్నాయి. పోగవాసన విపరీతంగా రావడంతో ప్రమాదాన్ని గమనించి అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. పలువురు ఉద్యోగులు తమ మోబైల్ ఫోన్లతో పోలీసులకు సమాచారం అందించారు.

ఖాన్ లతీఫ్ ఖాన్ భవనంలోని ఐదో అంతస్తులో ఉన్న ఉద్యోగులతో పాటు.. మిగతా అంతస్థులలో వున్న వారు కూడా అప్రమత్తమై సురక్షితంగా బయటకు వచ్చేయగా.. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగారు. ఫైర్ సిబ్బంది నలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటల్ని ఆర్పుతున్నారు. అయితే మంటలు అదుపులోకి రాకపోవడంతో ఘటనాస్థలానికి పది అగ్నిమాపక యంత్రాలు వెళ్లి మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు.

బిల్డింగ్‌లోని ట్యాక్స్ కన్సల్టెంట్‌ ఆఫీసులో జరిగిన షార్ట్‌ సర్క్యూట్‌తోనే ప్రమాదం సంభవించిందని అనుమానిస్తున్నారు. ప్రమాదం వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. ఈ భవనంలో పలు కీలక కార్యాలయాలు ఉన్నాయి. రెండో అంతస్తులో రెండు తెలుగు రాష్ట్రాల ఐడియా ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. చాలా మంది నివాసం కూడా ఉంటున్నారు. మంటల్ని గమనించి అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. లేకపోతే ప్రాణనష్టం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khan Lateef Khan Building  Fire Accident  Basheerbagh  hyderabad  Telangana  Crime  

Other Articles