Uppal police arrested Green Gold MD పల్లినూనే ఆశలు.. గ్రీన్ గోల్డ్ బయోటెక్ లీలలు..

Uppal police arrested green gold management for cheating people

Rachakonda police commissionarate, Uppal Police, arrest, Green Gold management, oil production machine, MD Jinna srikanth, manager Bhasker Yadav, crime, multi level marketing

The Rachakonda Uppal Police arrested an accused for cheating people on the name of oil production machine from Green Gold Biotech Company. The accused assured Rs 10,000 income every month and lured the public to buy the machines and cheated them.

పల్లినూనే ఆశలు.. గ్రీన్ గోల్డ్ బయోటెక్ లీలలు.. మధ్యతరగతికి శఠగోపం..

Posted: 01/24/2019 11:03 AM IST
Uppal police arrested green gold management for cheating people

పైన దగా, కింద దగా, కుడి ఎడమల దగా, దగా అంటూ శ్రీశ్రీ చెప్పిన సూక్తులు.. నేడు అడుగడుగునా ఎదురవుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి మరో మోసం బయటపడింది. మల్లీ లెవల్ మార్కెటింగ్ చేయడం తప్పని.. ఇది నేరమని ఓ వైపు పోలీసులు స్పష్టం చేస్తున్నా.. మధ్యతరగతి ప్రజల అశలపై పునాదులు వేసుకునే కేటుగాల్లు.. గొలుసుకట్టు మోసాలకు తెరలేపుతున్నారు. ఇటీవల కూకట్ పల్లిలో కరక్కాయల మోసం భయటపడినా.. పట్టించుకోని ప్రజలు.. తమ డబ్బుకు డబ్బు అదనంగా తోడవుతుందన్ని అక్రమార్కుల మాయమాటలకు లోనై.. మోసపోతునూ వున్నారు.

తాజాగా పల్లీ నూనె తీసిస్తే డబ్బు ఇస్తామని, అవసరమైన మిషనరీ తామే సమకూర్చుతామని కేటుగాళ్లు చెప్పిన మాటలకు ఉప్పల్ పరిసర ప్రాంతాల వాసలు ఏకంగా క్యూకట్టి డబ్బులు సమర్పించుకున్నారు. నిర్వాహకులు చివరికి ముఖం చాటేయడంతో లబోదిబోమన్న బాధితులు.. రాచకొండ పోలీసులను అశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్ కు కూతవేటు దూరంలో 'గ్రీన్ గోల్డ్‌ బయోటెక్‌' పేరుతో ఓ కార్యాలయం ఏర్పడింది.

ఏడాది క్రితం సికింద్రాబాద్ లో ఉన్న కార్యాలయాన్ని ఇక్కడికి మార్చి పక్కనే గోదామును కూడా అద్దెకు తీసుకున్నారు. రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే నెలకు రూ.20 వేలు సంపాదించుకునే అద్భుత అవకాశం అంటూ ప్రచారం మొదలుపెట్టారు. పది శాతం లాభం అనగానే సహజంగానే చాలా మందిని ఈ ప్రకటన ఆకర్షించింది. ‘యంత్రాలు, పల్లీలు మేమే ఇస్తాం. నూనె (లీటరు రూ.35), పిప్పి (కేజీ రూ.20)  మేమేకొంటాం. మీరు చేయాల్సిందల్లా పల్లీ గింజల నుంచి నూనె తీయడమే’ అని చెప్పడం మరింత ఆకట్టుకుంది.

ఉత్సాహం చూపిన వారి వద్ద నుంచి రూ.5 వేలు అడ్వాన్స్ గా తీసుకుని బాండ్‌ పేపర్ పై అగ్రిమెంట్‌ కూడా రాసివ్వడంతో చాలా మందికి గురికుదిరింది. దీనికి అదనంగా మరో ఆకర్షణను కూడా మోసగాళ్లు బయటకు వదిలారు. రూ.5 వేలు చెల్లించి ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వారు మరో ఐదుగురిని చేర్పిస్తే బహుమతులు ఇస్తామని, ఎక్కువ మందిని చేర్పించిన వారికి కార్లు, బ్యాంకాక్‌ టూర్లు ఉంటాయని నమ్మబలికారు. రూ.2 లక్షలు డిపాజిట్‌ చేయించిన వారికి వెంటనే రూ.5 వేలు నగదు ప్రోత్సాహకం అందించారు.

ఇన్ని ఆకర్షణలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో సహజంగానే చాలామంది ఈ మోసగాళ్ల వలలో చిక్కారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దాదాపు 6 వేల మంది సభ్యులుగా చేరడంతో వీరి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు. బాధితుల్లో రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌కు చెందిన ఇంద్రకిరణ్‌ (28) భార్య కూడా ఉన్నారు. ఈమె గ్రీన్‌గోల్డ్‌ బయోటెక్‌ ఎండీ శ్రీకాంత్‌, మేనేజర్‌ భాస్కర్‌ యాదవ్‌ను కలవగా ఆమె నుంచి రూ.లక్ష తీసుకుని అగ్రిమెంట్‌ రాసిచ్చారు.

నెలయ్యే సరికి ఇస్తామన్న డబ్బులు అడిగితే ఇవ్వలేదు. పలుమార్లు అడిగినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె భర్తకు విషయం చెప్పడంతో ఇంద్రకిరణ్‌ ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం బాగోతం బయటపడింది. సంస్థ కార్యాలయంపై దాడిచేసిన పోలీసులు అక్కడి సిబ్బందిని అదుపులోకి తీసుకోగా నిర్వాహకుడు శ్రీకాంత్‌ పరారీలో ఉన్నాడు. గతంలో కూడా శ్రీకాంత్‌ ఇలాంటి గొలుసుకట్టు వ్యాపారాలు చేసి మోసం చేసినట్టు, హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే అతనిపై పలు కేసులున్నట్టు బయటపడ్డాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles