జనసేనతో టీడీపీ పొత్తు విషయమై వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పై జనసేనాని.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. తమకు ఇవ్వజూపిన రాజ్యసభ పదవిని తమ పార్టీ వద్దనుకుంటే.. దాన్ని అందుకున్న టీడీపీ నేత టీజీ వెంకటేష్.. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీజీ నోరు అదుపులో పెట్టుకోవాలంటూ స్ట్రాంగ్ వార్నిగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లు పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోనంటూ మండిపడ్డారు.
టీజీ వెంకటేష్ కు పెద్దమనిషి అని గౌరవం ఇచ్చి ఇన్నాళ్లూ మాట్లాడానన్నారు పవన్. తాను నోరు విప్పితే మీరు ఏమవుతారో తెలియదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్తగా తమ లాభాలను మాత్రమే చూసుకుంటూ.. జనవళికి, జంతుజాలానికి దప్పికను తీర్చుతున్న నదులు, పర్యావరణాన్ని టీజీ వెంకటేష్ పరిశ్రమలు కలుషితం చేస్తున్నారని పవన్ ఆరోపించారు.
టీడీపీ నేతలు ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తారని ఏమీ ఆశించకుండా మద్దతిస్తే అధికారంలోకి వచ్చారని అన్నారు. నాలుగున్నరేళ్లుగా ఇటు ప్రజలను అటు గనులను ఏడాపెడా దోచుకుంటూన్నారని అరోపించారు. ప్రజాప్రతినిధులు సోమ, కిరణ్ లు మరణించడానికి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న అధికార ప్రభుత్వం, దానికి నేతృత్వం వహిస్తున్న చంద్రబాబే కారణమని ఆయన తేల్చిచెప్పారు.
కాగా, టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ విధానాలపై వ్యక్తిగత ప్రకటనలు చేయడం సరికాదని ఆయన వెల్లడించారు. ఈ తరహా ప్రకటనతో కార్యకర్తలను అయోమయానికి గురిచేయొద్దని ఆయన ఆదేశించారు. పార్టీ విధానాలపై మాట్లాడేటప్పుడు సంయమనం కోల్పోవద్దని సూచించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరికీ మంచిదికాదని చంద్రబాబు అన్నారు.
అసలేం జరిగిందంటే..
రాష్ట్రంలో ఏ పార్టీతో కలవకుండా కేవలం వామపక్ష పార్టీలతోనే తాము ఎన్నికల బరిలోకి దిగుతామని పవన్ కల్యాణ్ అనేకమార్లు స్పష్టం చేసినా.. ఇక అధికారంలోకి జనసేన వస్తుందని కూడా థీమా వ్యక్తం చేసినా.. వాటిని తోసిరాజుతూ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు జనసైనికులకు ఫైర్ అయ్యేలా చేశాయి. అవేంటంటే.. టీడీపీ, జనసేన మధ్య పెద్దగా రాజకీయ విభేదాలు లేవనిటీజీ వెంకటేశ్ అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
కేవలం కేంద్రంపై పోరాటం చేసే విషయంలోనే రెండు పార్టీలకు అభిప్రాయ భేదాలున్నాయని వ్యాఖ్యానించారు. సీఎం కుర్చీపై ఆశ లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో చాలాసార్లు చెప్పారని గుర్తు చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ కలిసినప్పుడు ఏపీలో టీడీప, జనసేన కలిస్తే తప్పేంటని టీజీ ప్రశ్నించారు. టీడీపీతో జనసేన కలిసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more