RRB recruitment 2018: Apply for 2835 apprentice posts ఈశాన్య, వాయువ్య రైల్వేస్ లో అప్రెంటీస్ పోస్టులు

Indian railway recruitment 2018 apply for 2835 apprentices posts

delhi, railway department, jobs, application, class 10th. SC ST BC age relaxation

North Eastern Railway (NER) is hiring 745 Apprentices.. while North Western Railways is hiring 2090 Apprentices. Railway Recruitment board has released a notification inviting interested, eligible candidates to apply for the posts.

ఈశాన్య, వాయువ్య రైల్వేస్ లో అప్రెంటీస్ సోస్టులు

Posted: 12/04/2018 06:57 PM IST
Indian railway recruitment 2018 apply for 2835 apprentices posts

ఐటీఐ పూర్తి చేసి అప్రెంటీస్ కోసం వేచి చూస్తున్న అర్హులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది. అప్రంటీస్ తో పాటు ప్రతిభ కనబర్చిన ఔత్సాహికులకు రైల్వే శాఖలోనే ఉద్యోగాలను కూడా అందించనుంది రైల్వేశాఖ. వివిధ జోన్ల‌లో 2018-19 సంవ‌త్స‌రానికిగానూ అప్రెంటిస్‌ పోస్టుల భ‌ర్తీకి జోన్ల వారీగా నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆయా జోన్ల‌కు విడివిడిగా ద‌ర‌ఖాస్తు చేసుకోచ్చు.

కేవలం 10వ తరగతి చదివితే ఏదేని ట్రేడులో రేండేళ్ల పాటు ఐటిఐ చేసిన వారికి అప్రెంటీస్ అందించిన ఆ తరువాత వారిలో ప్రతిభగల వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చేస్తుంది. అభ్యర్థులు రూ.100 ఫీజుగా చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు కూడా ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. కానీ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి వుంటుంది.

రైల్వే అప్రెంటిస్‌షిప్: 2835 పోస్టులు..
జోన్ల వారీగా ఖాళీలు ఇలా వున్నాయ్..
నార్త్ ఈస్ట‌ర్న్ రైల్వే (గోర‌ఖ్‌ఫూర్)- 745
నార్త్ వెస్ట‌ర్న్‌ రైల్వే (జైపూర్‌)     - 2090
మొత్తం ఖాళీలు                - 2,835
ట్రేడ్స్: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, మెకానిక్ (డీజిల్), ట్రిమ్మర్.

ఉద్యోగ దరఖాస్తుకు తగిన అర్హ‌త‌:
50 శాతంమార్కులతో ప‌దోత‌ర‌గ‌తితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ/ నేష‌న‌ల్ ట్రేడ్ స‌ర్టిఫికెట్ ఉత్తీర్ణ‌త‌ సాధించాల్సి వుంటుంది.  

దరఖాస్తు అభ్యర్థికి వుండాల్సిన వయోపరిమితి..
15 - 24 సంవ‌త్స‌రాల‌ మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 3 సంవత్సరాలు; ఓబీసీలకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోపరిమితి ఉంటుంది. మెట్రిక్యులేష‌న్, ఐటీఐ మార్కులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా వుంటుంది. ఎంపిక విధానంలోని నిబంధలను కూడా అభ్యర్థి దృష్టిలో పెట్టుకోవాలి.
చివ‌రితేది..
నార్త్-ఈస్ట‌ర్న్ రైల్వే - 29.12.2018
నార్త్-వెస్ట‌ర్న్‌ రైల్వే - 30.12.2018

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi  railway department  jobs  application  class 10th. SC ST BC age relaxation  

Other Articles