set back to Telangana Government in High court తెలంగాణ సర్కార్ కు హైకోర్టు ఝలక్.. రూ. 660 కోట్లు చె్లించాల్సిందే.!

Set back to telangana government in high court orders to pay rs 66o cr to unitech

telangana elections 2018, Telangana Electtions, kcr poll promise on muslim 12% quota, kcr loses cool, kcr angry, KCR, TRS Public Meet, !2% Reservation, minorities, asifabad, sirpur khagaznagar, suicide attempt, nerella, ktr, assembly elections, telangana politics

Set back to Telangana Government in High court in Unitech case. The apex court two judge bench upholds the single judge orders and directs state government to pay Rs. 66o cr to unitech

తెలంగాణ సర్కార్ కు హైకోర్టు ఝలక్.. రూ. 660 కోట్లు చె్లించాల్సిందే.!

Posted: 12/04/2018 06:03 PM IST
Set back to telangana government in high court orders to pay rs 66o cr to unitech

యూనీటెక్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. గతంలో సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పు సరైందేనని హైదరాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. యూనిటెక్‌ సంస్థకు రూ.660 కోట్లు చెల్లించాలని గత అక్టోబరులో తెలంగాణ ప్రభుత్వాన్నిఆదేశిస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు ప్రాథమికంగా సరైందేనని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. గతంలో ఆ సంస్థ చెల్లించిన అసలు రూ.165 కోట్లు ముందు చెల్లించాలని, మిగతా రూ.495.55 కోట్ల వడ్డీ వ్యవహారం తరువాత తేలుస్తామని పేర్కొంది.

యూనిటెక్‌ తరఫున న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వడ్డీ చెల్లింపు వ్యవహారంపై పూర్తిస్థాయి వాదనలు వినాలని కోరారు. సంస్థ ఛైర్మన్‌ గత ఏడాదిన్నరగా జైల్లో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ విఙ్ఞ‌ప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పూర్తిస్థాయి వాదనలు వినేందుకు విచారణను డిసెంబరు 10కి వాయిదా వేసింది. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ ఎస్వీ భట్ తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ మండల పరిధిలోని 350 ఎకరాల విస్తీర్ణంలో ఏరోస్పేస్‌ పార్క్‌ నిర్మించాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ఏపీఐఐసీ 2007లో బహిరంగ వేలం నిర్వహించింది. అప్పటికే ఈ భూమి యాజమాన్యపు హక్కులపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా, ఈ వేలంలో యూనిటెక్‌ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. నిబంధనల ప్రకారం ఏపీఐఐసీకి ఆ సంస్థ రూ.165 కోట్లు చెల్లించింది. అయితే, న్యాయపరమైన సమస్యలతో ఆ భూమిని యూనీటెక్‌కు ప్రభుత్వం అప్పగించలేదు.

మరోవైపు, భూ యాజమాన్యపు హక్కుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2011లో హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇక, 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీఐఐసీ టీఎస్‌ఐఐసీగా మారడం, ఆ తర్వాత హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేయడం జరిగింది. సుప్రీం కూడా హైకోర్టు తీర్పునే సమర్థిస్తూ ఆ భూమిపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కుల్లేవంటూ అప్పీల్‌ను కొట్టివేసింది.

దీంతో యూనిటెక్‌ కంపెనీ తాము చెల్లించిన రూ.165 కోట్ల వడ్డీతో సహా చెల్లించాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని, టీఎస్‌ఐఐసీని కోరింది. కానీ, దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో యూనీటెక్ మరోసారి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు తుది విచారణ జరిపి అక్టోబరు 23న తీర్పు వెలువరించారు. దీన్ని మరోసారి తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. అయితే, ద్విసభ్య ధర్మాసనం సైతం ఈ తీర్పును సమర్దించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles