Madras High Court Slams Tamil Nadu's Freebie Culture ఉచిత బియ్యంపై మద్రాసు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Free rice has made people of tamil nadu lazy says madras high court

Goondas Act, madras high court, tamil nadu govt, political parties, freebies, freebie cultues, People Lazy, Tamil Nadu, Politics

The Madras High Court said people had become lazy due to this culture and it has forced migrant workers from the northern states to take up menial jobs to avail these benefits.

ITEMVIDEOS: ఉచిత బియ్యంపై మద్రాసు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Posted: 11/23/2018 04:37 PM IST
Free rice has made people of tamil nadu lazy says madras high court

రాజకీయ పార్టీలో తమ లబ్ది కోసం ప్రజలను సోమరిపోతులుగా తయారు చేస్తున్నాయని మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం అందించే ఉచిత బియ్యంతో ప్రజలు సోమరులుగా మారారని అభిప్రాయపడింది. ఉచిత బియ్యం పథకం మంచిదే అయినా దానిని కేవలం నిరుపేదలకు మాత్రమే అందించాలని కోరింది. అలా కాకుండ ప్రభుత్వాలు అన్ని వర్గాల ప్రజలకు వీటిని ఉచితంగా అందిస్తుండటంతో ప్రజలు సోమరులయ్యారని పేర్కోంది. ఉచిత పథకాలు పేదలకు, లేక అభాగ్యులకు మాత్రమే అందించాలని తెలిపింది.

ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించటంలో భాగంగా ప్రభుత్వం ఉచిత బియ్యం పంఫిణీ పథకాన్ని అన్నివర్గాల వారికి అందిస్తుందని, ఇలాంటి కార్యక్రమాలు ప్రజలను నిష్ప్రయోజకులుగా మారుస్తుందని అన్నారు. ఇకపై ఈ పథకాలను పేదలకు మాత్రమే వర్తింపజేయాలని అదేశించింది. ఇకపై బియ్యం, ఇతర సరకులు ఉచితంగా కేవలం పేదలు, బడుగులు, అభాగ్యులకు మాత్రమే అందించాలని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వం ప్రతిదీ ఉచితంగా ఇవ్వాలని కోరుకుంటున్నారని కోర్టు తెలిపింది. దీని ఫలితంగా ప్రజలు సోమరులు అవుతున్నారని పేర్కొంది.

2017-18 వ సంవత్సరంలో రూ.2,110 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఉచిత బియ్యం కోసం ఖర్చు చేసిందని కోర్టు తెలిపింది. నిరుపేదలకు మాత్రమే మాత్రమే ఉచిత బియ్యం ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని జస్టిస్ ఎన్.కిరుబకరన్ ,అబ్దుల్ ఖ్వాదీస్ తో కూడిన బెంచ్ అడ్వకేట్ జనరల్ కు సూచించింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమైన బీపీఎల్ సర్వే చేయించిందా అని ప్రశ్నించింది. గత పదేళ్ల వార్షిక రిపోర్టులను నవంబర్ 30 జరిగే తీర్పు నాటికి అందించాలని సివిల్ సప్లై కార్పోరేషన్ ను కోర్టు ఆదేశించింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles