Mumbai detective cracked her toughest case లేడీ డిటెక్టివ్ ఆ హత్యకేసును చేధించిన విధంబెట్టిదనినా..

Mumbai detective cracked her toughest case a murder mystery

humans of bombay, mumbai, Rajani Pandit, first lady detective, facebook, social media, murder mystery, viral

Rajani Pandit, Touted as India’s first female detective, has recently been featured on the Humans of Bombay Facebook page and her story about how she cracked her toughest case, a murder mysery, has gone viral.

తొలి లేడీ డిటెక్టివ్ రజనీ పండిత్ స్టోరీ వైరల్..

Posted: 11/01/2018 11:48 AM IST
Mumbai detective cracked her toughest case a murder mystery

పలువురు ప్రముఖుల కాల్ డేటా రికార్డింగ్ సంబంధించిన కేసులో ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు అయిన తొలి మహిళా డిటెక్టివ్ రజనీ పండింత్ ఇప్పుడు నెట్టింట్లో సంచలనంగా మారారు. ఈ కేసులో సుమారు 40 రోజుల తరువాత మార్చి 14న జైలు నుంచి బెయిల్ పై విడుదలయిన తరువాత అమె కొంత అసహనానికి లోనయ్యారు. ఆ తరువాత క్రమంగా అసలు తాను తప్పు చేయలేదని, అయితే కేసుల పరిశోధన, పరిష్కారం కోసం ఇలా చేయాల్సి వచ్చిందని కూడా అమె చెప్పలేదు.

కానీ తనదైన శైలిలో తాను ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్లి.. ఎలా కేసులను చేధించానన్న విషయాన్ని మాత్రం అమె తెలిపారు. ఓ హత్య కేసును ఛేదించేందుకు పనిమనిషి వేషం ఎత్తానని, ఆరు నెలలపాటు వారింట్లో పనిచేసి కేసు మిస్టరీని విజయవంతంగా ఛేదించానని పేర్కోంది. ముంబైలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనమైంది. సాధారణంగా సినిమాల్లోనే కనిపించే ఇలాంటి ఘటనలు నిజం చేసి కేసులను చేధించిన తీరును అమె విశ్లేషించింది. దీంతో ఎంతో క్లిష్టమైన హత్య కేసును తొలి మహిళా డిటెక్టివ్ చేధించిన విధానం నెట్టింట్లోని జనులకు విపరీతంగా నచ్చింది.

ఈ కేసు పూర్తి వివరాలను రజనీ పండిట్ తాజాగా తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు చేసింది. ఓ హత్య కేసును ఛేదించేందుకు తానేం చేసిందీ వివరించింది. కట్టుకున్న భర్తను, కుమారుడిని హత్య చేసినట్టు ఓ మహిళ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ హత్యలోని మిస్టరీని ఛేదించాల్సిందిగా కేసు రజనీ పండిట్ వద్దకు వచ్చింది. 22 ఏళ్ల వయసులోనే తొలి కేసును ఛేదించిన రజనీ దీనిని సవాలుగా తీసుకుంది. అనుమానితురాలి ఇంట్లోనే పనిమనిషిగా చేరింది. ఆరు నెలలపాటు పనిచేసింది. చివరికి నిందితురాలే హత్య చేసినట్టు నిరూపించింది.

ఓసారి తాను రికార్డింగ్ చేసుకునే సమయంలో సౌండ్ వచ్చిందని, దీంతో ఆమె తనను అనుమానించడం మొదలుపెట్టిందని రజనీ పేర్కొంది. తనపై నిఘా పెట్టిందని, తాను బయటకు వెళ్లేటప్పుడు గమనించేదని వివరించింది. చివరికి భర్తను హత్య చేసేందుకు ఓ కిరాయి హంతకుడితో ఒప్పందం కుదర్చుకున్న విషయాన్ని గుర్తించి సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది. ఆమె స్టోరీకి విపరీతమైన స్పందన వచ్చింది. ఒక్క రోజైనా గడవకముందే 1300 షేర్లు, 1600 రియాక్షన్లు వచ్చాయి. అమె జీవిత చరిత్రను కూడా ఓ సినిమాగా తీయాలని నెటీజనులు కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : humans of bombay  mumbai  Rajani Pandit  first lady detective  facebook  social media  murder mystery  viral  

Other Articles