Twitterati Reacts Hilariously on Tantrik Tactics ఆయన చెప్పడం వల్లే రాహుల్ ఇలా చేశాడా.?

Bjp leader blames tantrik tactics for rahul gandhi hugging pm modi

BJP, Congress, Rahul Gandhi, pm modi, Tajinder singh, tantrik, netzens, social media, no confidence motion, amit shah, politics

BJP spokesperson Tajinder Pal Singh Bagga tweeted about the hug being a tantrik ritual to make Rahul the next PM. The Twitterati soon came up with hilarious responses to Bagga’s tweet,

ఆయన చెప్పడం వల్లే రాహుల్ ఇలా చేశాడా.?

Posted: 07/26/2018 08:08 PM IST
Bjp leader blames tantrik tactics for rahul gandhi hugging pm modi

నిండు సభలో ప్రధాన మంత్రిని ఒక ప్రతిపక్ష నేత వచ్చి కౌగిలించుకోవడం పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి కాగా, దీనిపై ఒక్కక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. రాహుల్ గాంధీవి పిల్లచేష్టలని ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటే.. రాహుల్ తన మదిలో ఎలాంటి విద్వేషం లేదని ఈ ఆలింగనం ద్వారా రుజువు చేశారని మరికొందరు పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే దీనిపై బీజేపి అధికార ప్రతినిధి తేజిందర్ సింగ్ మాత్రం మరో వాదనను తెరపైకి తీసుకువచ్చాడు.

రాహుల్ అలా కౌగించుకోవడం వెనుక ఓ తాంత్రికుడు ఉన్నాడని ఆయన చెప్పడం వల్లే రాహుల్ ఇలా చేశాడని.. రాహుల్ చర్యను టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేశాడు. బీజేపి అధికార ప్రతినిధి తజిందర్ పాల్ సింగ్ బగ్గా ఈ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘నువ్వు ప్రధాని కావాలని అనుకుంటున్నట్లయితే.. సభలో నీ ప్రసంగం అయిపోయిన తరువాత ప్రధాని కుర్చీ వద్దకు వెళ్లి దానిని తాకాలని ఓ తాంత్రికుడు రాహుల్‌ గాంధీకి సూచించాడట. ఈ విషయాన్ని తనకు అత్యంత సన్నిహితుడైన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ చెప్పాడని పేర్కొన్నారు. ఆ కుర్చీ కోసమే రాహుల్ మోదీని కౌగిలించుకున్నారని విమర్శించారు.

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే.. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ అవిశ్వాసానికి ప్రతిపక్షాలన్నీ మద్దతు తెలపడంతో స్పీకర్ దీనికి ఆమోదం తెలిపారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ.. మునుపెన్నడూ లేని రీతిలో కేంద్రంపై నిప్పులు చెరిగారు. ప్రసంగం ముగిశాక... ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు వచ్చి ఆలింగనం చేసుకున్నారు. ఈ చర్యతో సభలోని సభ్యులంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. దీంతో నెట్ జనులు మాత్రం తమకు ఇష్టనుసారంగా రెచ్చిపోతే.. నవ్వులు అపుకోలేని విధమైన ట్వీట్లు చేస్తున్నారు. తేజిందర్ పాల్ ను లక్ష్యంగా చేసుకుని ట్రాల్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Congress  Rahul Gandhi  pm modi  Tajinder singh  tantrik  netzens  social media  no confidence motion  amit shah  politics  

Other Articles