Shoe hurled at CM Fadnavis at Delhi's Ramlila Maidan ‘మహా’ సీఎంకు చేధు అనుభవం..

Shoe hurled at stage during maharashtra cm devendra fadnavis speech

Anna Hazare, Devendra Fadnavis, Maharashtra Chief Minister, Ramlila Maidan, Protesters, shoe hurled at CM, Delhi, politics

Shoe hurled at stage while Maharashtra CM Devendra Fadnavis addressed farmers' protest lead by Anna Hazare at Delhi's Ramlila Maidan

ITEMVIDEOS: ‘అన్నా’ దీక్ష విరమణలో ‘మహా’ సీఎంకు చేధు అనుభవం..

Posted: 03/30/2018 10:42 AM IST
Shoe hurled at stage during maharashtra cm devendra fadnavis speech

అవినీతి రహిత భారత నిర్మాణం కోసం కంకణబద్దుడై నిరాహార దీక్షకు పూనుకున్న సామాజిక కార్యకర్త అన్నాహాజరే.. సమర్థవంతమైన లోక్ పాల్ చట్టంతో పాటు, రాష్ట్రాలలో లోకాయుక్త బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హస్తినలోని రాంలీలా మైదనాంలో దీక్షకు పూనుకున్న విషయం తెలిసిందే. అయితే అన్నా దీక్షకు కేవలం రాష్ట్ర సమస్యగా సృష్టించే ప్రయత్నం చేసి.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢ్నావిస్ సహా కేంద్రమంత్రిని దీక్షాస్థలి వద్దకు పంపి.. దీక్షను విరమింపజేసేందుకు బీజేపి ప్రభుత్వం సఫలీకృతమైంది.

అయితే కేంద్ర వ్యవసాయ మంత్రి కూడా అన్నా దీక్షస్థలి వద్దకు వెళ్లి ఆయన కోరుకున్నట్లుగానే రైతుల హక్కులు కాపాడేందుకు తమ ప్రభుత్వం నిత్యం కృషి చేస్తుందని కూడా హామీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా వేదిక‌పై నుంచి అందోళనకారులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ తమ ప్రభుత్వం అన్నా హాజారే హామీలను నెరవేర్చందుకు కృతనిశ్చయంతో వుందని ప్రసంగిస్తున్న క్రమంలో ఆయనకు చేధు అనుభవం ఎదురైంది.

అందోళనకారుల్లోని గుర్తుతెలియని వ్యక్తి ఫడ్నావిస్ ప్రసంగిస్తున్న క్రమంలో ఆయనపై షూ విసిరారు. అయితే అది కాస్తా అయనను తగలకుండా అయనకు కుడివైపుగా కొద్ది దూరంలో అక్కడ వేదికపైన కూర్చున్నవారిపై పడింది. కేంద్రంలో లోక్‌పాల్‌, రాష్ట్రాల్లో లోకాయుక్తలను త్వరలోనే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తరఫున ఫడ్నవిస్ చెబుతుండ‌గానే ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు మీడియాకు చిక్కాయి. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి ఎవరు అని పరిశీలిస్తున్నారు. అయితే బీజేపి ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా.. అన్నా మద్దుతుదారులు  మాత్రం వ్యతిరేకంగానే వున్నారని, వారిలో అగ్రహం మాత్రం చల్లారలేదనడానికి ఈ ఘటనే నిదర్శనం.

#WATCH Shoe hurled at stage while Maharashtra CM Devendra Fadnavis addressed farmers' protest lead by Anna Hazare at Delhi's Ramlila Maidan pic.twitter.com/BmYVWPKazG

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles