'Ockhi' intensifies as severe cyclone పెను తుఫానుగా మారిన ఓఖి..

Kerala braces for heavy rains as cyclone ockhi nears

weather forecast, cyclone ockhi, Lakshadweep, conventional cyclone, weather disturbance, Andaman Sea, depression, rain forecast, India Met Department, Vinson Kurian, North East monsoon, South Andaman Sea, Tamil nadu, karnataka, kerala, heavy rains, weather ,weather ,forecast

'Ockhi' has intensified as severe cyclone while moving initially west-north-west across Lakshadweep for the rest of the day and later north-west.

పెను తుఫానుగా మారిన ఓఖి.. అప్రమత్త హెచ్చరికలు జారీ

Posted: 12/01/2017 02:41 PM IST
Kerala braces for heavy rains as cyclone ockhi nears

ఓఖి తుపాను మరింత బలోపేతంగా తయారవుతుంది. తుపానుగా కొనసాగుతున్న ఓఖి తీరం దాటే సమయానికి పెను తుఫానుగా మారి ప్రళయాన్ని సృష్టిస్తుందన్న వార్తలు తమిళనాడు, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ దీవుల్లోని ప్రజలకు కంటిమీద కనునుకు దూరం చేస్తున్నాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంలో వాయుగుండంగా ప్రారంభమైన ఓఖీ తుపానుగా రూపాంతరం చెంది తీరప్రాంతాలపై ప్రకృతి భీభత్సాన్ని చాటేందుకు సిద్దంగా వుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

ప్రస్తుతం మినికాయ్‌ దీవులకు 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై వున్న ఓఖి.. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది. రాగల 24 గంటల్లో ఇది మరింత తీవ్రతరంగా మారే సూచనలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 4వరకు పెనుతుపానుగా కొనసాగనున్నట్లు చెబుతున్నారు. దీని ప్రభావంతో ఇప్పటికే ఎడతెరపిలేని భారి కుండపోత వర్షాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తమిళనాడు, కేరళ, లక్షద్వీప్ లోని పలు ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.

అతి భారీ వర్ష సూచన
ఓఖి ప్రభావంతో తీరం వెంబడి గంటకు 100-110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరో 24 గంటల్లో కేరళ, కర్ణాటక, తమిళనాడు, లక్షద్వీప్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళలో 20 సెం.మీల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. పెనుగాలుల వల్ల చెట్లు, సెల్ టవర్లు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఓఖి తుపాను నేపథ్యంలో శబరిమల వెళ్లే యాత్రికులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం సముచితమని సూచిస్తున్నారు. ఇప్పటికే బయలుదేరిన భక్తులు అప్రమత్తంగా ఉండాలని తుపాను ప్రభావిత రాష్ట్రాలు హెచ్చరికలు జారీచేశాయి.

9 మంది మృతి
తుపాను కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో 9మంది మృతిచెందారు. తమిళనాడులోని కన్యాకుమారిపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునెల్వేలి, రామనాథపురం, పుదుకోట్లై, తిరుచ్చి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటలు భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీచేయడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ క్రమంలో తమిళనాడులోని 11 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మత్య్సకారులెవరూ సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేశారు.

మరోవైపు దక్షిణ అండమాన్‌ సముద్రంతో పాటు పరిసర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరో 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో తమిళనాడు తీరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles