AIADMK bypoll candidate to be picked tomorrow అభ్యర్థి ఎంపికలోనూ అన్నాడీఎంకేలో అధిపత్య పోరు

Rk nagar bypoll eps ops faction calls truce candidate to be picked tomorrow

AIADMK faction, AIADMK row, Election Commission, EPS-OPS camp, Jayalalithaa, E Palaniswamy, Madurai, political legacy, V Maithreyan, Tamil Nadu, politics

The AIADMK announced it was "restructuring" the parliamentary board, which now includes Chief Minister K Palaniswamy and deputy chief minister O Panneerselvam and also decides rk nagar bypoll candidate.

అభ్యర్థి ఎంపికలోనూ అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు

Posted: 11/28/2017 10:36 AM IST
Rk nagar bypoll eps ops faction calls truce candidate to be picked tomorrow

తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత రాజకీయాలలో ఎప్పటికప్పుడు చోటుచేసుకుంటున్న పరిణామాలు అరవరాష్ట్రవాసులతో పాటు యావత్ దేశాన్ని అకర్షిస్తున్నాయి. టీటీవీ దినకరన్ అరెస్టు తరువాత శశికళ వర్గం నేతలపై వరుస ఐటీ దాడులు నేపథ్యంలో విపక్షంలో అంతా ప్రశాంత వాతావరణం చోటుచేసుకోగా, అధికార అన్నాడీఎంకేలో మాత్రం హర్షం వ్యక్తమైంది. ఇదే తరుణంలో పార్టీకి చెందిన రెండాకులు గుర్తు కూడా చేతికందిన క్రమంలో అర్కే నగర్ ఉప ఎన్నిక మళ్లీ అధికార పార్టీలో మళ్లీ వర్గవిబేధాలకు కారణమైంది.

ఆర్‌కే నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థి ఎంపిక కోసం జరిగిన అన్నాడీఎంకే కార్యనిర్వాహక మండలి సమావేశంలో ముఖ్యమంత్రి ఎడప్పాడి వర్గం, ఢిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం వర్గం మధ్య మరోమారు అభిప్రాయ బేధాలు చోటుచేసుకున్నాయి. ప్రత్యేకించి ఆర్‌కే నగర్‌ అభ్యర్థిగా మధుసూదన్ ను ఎంపిక చేసే విషయమై పన్నీర్ సెల్వం వర్గం రెండుగా చీలిపోయింది. ఓ వర్గం మధుసూదన్ కు మద్దతు ప్రకటిస్తే, మరో వర్గం వ్యతిరేకించడంతో బేధాభిప్రాయాలు బయటపడ్డాయి.

సీఎం ఎడప్పాడి వర్గం మాజీ మంత్రి గోకుల ఇందిర అభ్యర్థిత్వాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఆర్‌కే నగర్ ఉప ఎన్నికల బరిలో ఈ సారి ఓ యువకుడిని పోటీకి దింపితే బాగుంటుందని సూచించింది. ఎడప్పాడి వర్గం నుంచి మాజీ మంత్రి గోకుల ఇందిరను అభ్యర్థిగా ఎంపిక చేయాలని పలువురు సూచించారు. దీనితో ఈపీఎస్‌, ఓపీఎస్‌లు అయోమయంలో పడ్డారు. అభ్యర్థి ఎంపికను ఈనెల 29వ తేదీకి వాయిదా వేశారు. అంత వరకూ ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ops vs eps  RK NAGAR BYPOLL  Panner Selvam  palani swamy  Jayalalitha  sasikala  tamil politics  

Other Articles