two held for duping marriage hosts in tamilnadu కొత్తా దొంగలండీ బాబూ.. సడేమియాలతో జర భద్రం..!

Two held for duping marriage hosts in kavilpattu of tamilnadu

new thieves, new type of robbery, duping in marriage, cheating in marriage, dhani koti, pachaiammal, duping, cheating, marriage hosts, kovilpatti, Thoothukudi District, tamilnadu

A man and woman held for duping marriage hosts at kovilpatti of Thoothukudi District in tamilnadu

కొత్తా దొంగలండీ బాబూ.. సడేమియాలతో జర భద్రం..!

Posted: 09/06/2017 12:00 PM IST
Two held for duping marriage hosts in kavilpattu of tamilnadu

ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్న చందంగా.. ఏక్కడ పెళ్లి జరిగినా.. కొత్త తరహాలో దొంగలు చెలరేగిపోతూ హాడావిడి సృష్టిస్తున్నారు. ఇదివరకు కడుపునిండా పెళ్లి బోజనం అరగించేందుకు పిలవని పేరంటానికి వచ్చే పెద్దమనుషులు పుల్లగా తినేసి ఎంచక్కా చెక్కేసేవాళ్లు.. కానీ ఈ మధ్యకాలంలో ట్రెండ్ మార్చిన దొంగలు పెళ్లి మండపాలనే తమ టార్గెట్లుగా చేసుకుని రెచ్చిపోతున్నారు. ఆ మధ్య ఇలాంటి పెళ్లి హాడావిడిలోనే పెళ్లింటి మహిళలను మోసగించి.. వారి నగలతో ఉడాయించిన మహిళలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు కటకటాల వెనక్కి నెట్టిన సంగతి తెలిసిందే.

అయితే అదే తరహాలో మోసానికి పాల్పడుతున్నారు కొత్త దొంగలు. సందెట్లో సడేమియాలుగా చెలరేగిపోతున్నారు. పిలవని పేళ్లిళ్లకు హాజరవ్వడమే కాకుండా.. సరిగ్గా చదివింపుల కార్యక్రమం వచ్చే సరికి ఈ దొంగలు తమ టాలెంట్ ను ప్రదర్శిస్తున్నారు. అదెలా అంటే.. చదివింపులలో తాము కూడా పోటీ పడి మరీ రాయిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చే ఈ సండేమియాలు.. అసలు ఇచ్చింది ఏమీ వుండదు.. అయితే అదే సమయంలో అక్కడ చదివింపులు రాసుకుంటున్న వ్యక్తిని బురిడీ కొట్టించి.. చేతికి వచ్చినంత డబ్బును జేబులో వేసుకుని.. పెళ్లి బోజనం చేసి మరీ వెళ్తున్నారు.

సరిగ్గా తమిళనాడులోని తూత్తుక్కుడి జిల్లా.. కోవిల్ పట్టి పెళ్లి మండపంలో ఇలానే బురిడీ చేయబోయి ఇద్దరు అడ్డంగా కోవిల్ పట్టి సమీపంలో గల కరుపూర్ కు చెందిన వీరస్వామి కుమారుడు నిరుబన్ కు వినితతో కోవిల్ పట్టిలో పెళ్లి జరుగింది. చివరిదశలో చదివింపుల కార్యక్రమానికి చేరుకోగానే.. కరుపూర్‌కు చెందిన విజయకుమార్‌ చదివింపులను వసూలు చేస్తూ రాసుకుంటున్నాడు. అనేక మంది క్యూలో నిలబడి చదివిస్తున్నారు. రద్దీగా ఉన్న ఆ సమయంలో 40 ఏళ్ల  వ్యక్తి తాను రూ. 2 వేలు ఇచ్చానని అందులో రూ.200 తీసుకుని మిగిలిన చిల్లర ఇవ్వాలని అడిగాడు. ఇవ్వకుండానే ఇచ్చానని ఎవరు చెబుతారనుకుని.. సరిగ్గా గమనించని విజయకుమార్‌ రూ. 1800 తిరిగి ఇచ్చాడు.

అలా మిగతావారి చదివింపులు రాసుకుంటుండుగా, కొంత సేపటి తర్వాత 50 ఏళ్ల మహిళ వచ్చి.. తాను రూ.2 వేలు ఇచ్చానని రూ.200 తీసుకుని మిగతా డబ్బు ఇవ్వాలని అడిగింది. అనుమానం వచ్చిన విజయకుమార్ ఆ మహిళ కొద్దిసేపు అపాడు. ఈలోగా మిగతావారిని చదివింపులను రాసుకున్న తరువాత ఆ మహిళను, అంతకుముందు రూ.1800 తీసుకున్న వ్యక్తిని గుర్తించి పట్టుకుని.. పోలీసులకు అప్పగించారు. వీరిని మదురై జిల్లా నాగమలై పుదుకోట పావలర్ ఎస్టేట్ ప్రాంతానికి చెందిన ధనికోటి(40), పిచ్చైయమ్మాల్‌(50)గా గుర్తించిన పోలీసులు వారిని కటకటాల వెనక్కి నెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dhani koti  pachaiammal  duping  cheating  marriage hosts  kovilpatti  Thoothukudi District  tamilnadu  

Other Articles