Telangana CM To Celebrate Dussera In Andhra ఆంధ్రలో తెలంగాణ సీఎం కేసీఆర్ దసరా పండగ

Telangana cm to celebrate dussera in andhra

Telangana CM, KCR, TRS, Vijayawada, nose stud, Kanakadurga Temple, Vijaya Dasami celebrations, Indrakeeladri, Dussera, Andhra pradesh

Telangana Chief Minister K Chandrasekhar Rao and his family members are keen to celebrate Dussera festival at Kanakadurga temple, atop Indrakiladri in Vijayawada this year.

ఆంధ్రలో తెలంగాణ సీఎం కేసీఆర్ దసరా పండగ

Posted: 09/06/2017 02:37 PM IST
Telangana cm to celebrate dussera in andhra

పోరుగు రాష్ట్రంపై, పోరుగురాష్ట్ర ప్రభుత్వంపై అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్న చందంగా.. ముదిరినప్పుడు ముప్పేటదాడి చేస్తూ.. మాదిరిగా వున్నప్పుడు స్నేహహస్తం అందిస్తూ.. పరిస్థితులను బట్టి మాటలను మారుస్తూ.. పోరుగు రాష్ట్రంపై క్లారిటీలో ప్రజలకు స్పష్టమైన విధానాన్ని చెప్పకుండానే ఏమారుస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే దసరా పండగ సంబురాలను మాత్రం ఆంధ్రప్రదేశ్ లో జరుపుకునేందుకు సిద్దం అవుతున్నారు. ఈ మేరకు ఆయన తన పర్యటనను కూడా ఖరారు చేసుకున్నారు.

అందేంటి.. దసరా పండగ అంటే నవరాత్రులన్నీ రోజులు అత్యంత వైభవోపేతంగా అటు దసరా, దానికి తోడు గౌరదేవీ పూజలతో బతుకమ్మ ఉత్సవాలు, ఇటు పెద్దల అశీర్వాదం పోందే పెత్తరామాస అన్ని పండుగల మేళవితమైన విజయదశమిని సీఎం కేసీఆర్ తెలంగాణలో కాకుండా అంధ్రరాష్ట్రంలో జరుపుకుంటున్నారా..? అన్న అనుమానాలు  కలుగుతున్నాయా..? అవును. నిజంగానే. అయితే అన్ని రోజులు అక్కడే వుండిపోరండీ. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ఇంద్రకీలాద్రిపై కొలువై.. భక్తులకు కొంగుబంగారమై వెలసిన బెజవాడ కనకదుర్గమ్మకు ఆయన కానుకలు సమర్పించనున్నారు.

విజయదశమి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారి మొక్కును తీర్చుకోవడానికి ఈ నెల 27 న కేసీఆర్‌ కుటుంబ సమేతంగా విజయవాడకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ముక్కు పుడకను సమర్పించనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే దుర్గమ్మకు ముక్కుపుడక సమర్పిస్తానని కేసీఆర్‌ మొక్కుకున్న క్రమంలో మొక్కును తీర్చుకునేందుకు ఈ దసరా నవరాత్రులందు ఇంద్రకీలాద్రికి వెళ్లన్నారు. కేసీఆర్‌ ఇప్పటికే వరంగల్‌ భద్రకాళీ అమ్మవారికి బంగారు కిరీటం, స్వర్ణపత్రాలు, తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి స్వర్ణ సాలిగ్రామహారం, స్వర్ణ కంఠాభరణాలు, కురవి వీరభద్రుడికి బంగారు మీసం సమర్పించి మొక్కులు తీర్చుకున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana CM  KCR  TRS  Vijayawada  nose stud  Kanakadurga Temple  Andhra pradesh  

Other Articles