Thieves Fail To Smash Glass Door With Hammers దొంగలకు టైం కలిసోచ్చినా.. అదృష్టం కలసిరాలేదు..

Thieves fail to smash glass door with hammers leave empty handed

CCTV, cctv robbery fail, robbery fail Melbourne, Melbourne, theft caught on camera

CCTV footage has captured three men bungling up a robbery attempt by failing to smash down the glass door of a jewellery store.

ITEMVIDEOS: దొంగలకు టైం కలిసోచ్చినా.. అదృష్టం కలసిరాలేదు..

Posted: 08/31/2017 08:34 AM IST
Thieves fail to smash glass door with hammers leave empty handed

ఏ కార్యం చేయాలన్న ఎంతటి సంకల్పం వున్నా.. చివరకు లక్ కూడా కలసి రావాలి. అది లేదంటే ఎంత శ్రమించినా ఫలితం వుండదు, అదే అదృష్టం వున్నందంటే.. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా.. సునాయాసంగా నీ కీర్యం పూర్తవుతుందని పెద్దలంటారు. ఇది ముమ్మాటికీ నిజమేనని ఈ చోరులను చూస్తే అర్థమవుతుంది. అన్ని కలిసోచ్చాయి కదా అని ఎగేసుకుని దొంగతనానికి వెళ్లి నిమిషాల్లో అంతా ముగించేసుకుని రాత్రికి రాత్రి కుబేరులైపోదామనుకున్న దోంగలకు అదృష్టం కలసిరాక.. తోకముడుచుకుని పరారైన ఘటన ఇది.

అస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆభ‌ర‌ణాల‌ షోరూంలో దొంగ‌త‌నం చేయ‌డానికి ముగ్గురు దొంగ‌లు వ‌చ్చారు. సుత్తెలు ప‌ట్టుకొని షోరూం గాజు త‌లుపు బ‌ద్ద‌లు కొట్ట‌డానికి ప్ర‌య‌త్నించారు. ముగ్గురు క‌లిసి త‌మ సుత్తుల‌తో త‌లుపును బాద‌డం ప్రారంభించారు. ఎన్ని సార్లు కొట్టినా చీలిక‌లు ప‌డుతోందే త‌ప్ప గాజు ప‌గ‌ల‌డం లేదు. కాలితో త‌న్నారు, ఏకంగా తలుపును బలంగా తోశారు. అయినా ఎలాంటి ప్ర‌యోజనం లేక‌పోవ‌డంతో తోక‌ముడిచి, అక్క‌డి నుంచి పారిపోయారు. ఈ దొంగ‌త‌నం తాలుకు సన్నివేశాలు సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు ఇటీవ‌ల విడుద‌ల చేశారు. త‌లుపు ప‌గ‌ల‌గొట్ట‌డానికి దొంగ‌లు ప‌డుతున్న క‌ష్టాన్ని మీరు కూడా చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CCTV  cctv robbery fail  robbery fail Melbourne  Melbourne  theft caught on camera  

Other Articles