MP K Keshava Rao Daughter name in Land Scam

Trs mp daughter in land scam

MP KK, KK Daughter, KK Daughter Land Scam, Gadwala Vijayalaxmi, MP K Keshava Rao Daughter, KK Daughter, Land Scam TRS MP, Gold Stone KK Daughter, Gold Stone Company Telangana, Telangana Land Scam

TRS MP K Keshava Rao Family in Land Scam. His Daughter Gadwala Vijayalaxmi purchase 38 acres land from Gold Stone Company. But, Those were belongs to Telangana Government.

భూ స్కాం.. చిక్కుల్లో టీఆర్ఎస్ ఎంపీ కూతురు

Posted: 06/10/2017 09:36 AM IST
Trs mp daughter in land scam

తెలంగాణలో భూ ఆక్రమణ కేసు కొత్త మలుపు తిరిగింది. కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కుంటున్న గోల్డ్ స్టోన్ కంపెనీ తెనే తుట్టే కదిలే కొద్ది సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. టీఆర్ఎస్ ఎంపీ(రాజ్యసభ) కేకే కూతురు విజయలక్ష్మి పేరు ఇందులో ప్రధానంగా వినిపిస్తోంది. ఆమె పేరిట 38 ఎకరాల భూమి ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.

ఇబ్రహీం పట్నం దండు మైలారం లో ఈ భూమి ఉన్నట్లు తెలుస్తోంది. గోల్డ్ స్టోన్ కంపెనీ భూముల్నే ఆమె కొనుగోలు చేసినట్లు తేలింది. భూముల్ని సబ్ రిజిస్ట్రర్ ఖాదిర్ రిజిస్ట్రర్ చేయగా, అతనిపై ఇప్పటికే వేటు పడింది కూడా. సర్వే 36లో 38 ఎకరాల ఈ భూములను గద్వాల విజయలక్ష్మి కొనుగోలు చేసింది.  భూ రాబందుల కహానీ

గోల్డ్ స్టోన్ పార్థసారథి అటవీ భూములను తమ కంపెనీకి చెందినట్లుగా చెప్పుకుని ఆమెకు కట్టబెట్టినట్లు విచారణలో వెల్లడైంది. ప్రభుత్వ భూములు అక్రమ రిజిస్ట్రేషన్ అని తేల్చిన అధికారులు. ప్రస్తుతం ఆమె టీఆర్ఎస్ లో అధికారిక సభ్యురాలిగా కూడా ఉంది. 

మీడియాపై కేకే ఫైర్... 

ఆరోపణలపై కేకే స్పందించాడు. తమ కుటుంబ సభ్యులు ఆ భూములను కొనుగోలు చేశారని అన్నారు. అయితే అందుకు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని, తాము చట్టప్రకారమే భూములు కొనుగోలు చేశామని వివరించాడు. మొత్తం 50 ఎకరాల్లో 38 ఎకరాలు మాత్రమే అక్రమమని తేలినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ భూమి విజయలక్ష్మితోపాటు జ్యోత్స్న, నవజ్యోతి పేరుతో రిజిస్ట్రర్ అయ్యి ఉంది.

అయితే 'గోల్డ్ స్టోన్ పార్థసారధి ఎలాంటివాడో తెలియదా?' అని మీడియా ప్రతినిధి రెట్టించడంతో ఆయన సహనం కోల్పోయారు. 'నేనేమన్నా బిచ్చగాడిననుకున్నావా? సారూ... బ్యాక్ గ్రౌండ్ తెలియకుండా కొనడానికి?' అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై మీడియా ప్రతినిధి మళ్లీ ప్రశ్నించే ప్రయత్నం చేయడంతో....'నేనేం చెప్తున్నానో అర్థం చేసుకోండి...నీ కంటే పెద్ద జర్నలిస్టునే నేను' అంటూ మండిపడ్డాడు. 'రిజిస్ట్రార్ పెద్దా? సుప్రీంకోర్టు పెద్దా? చట్టాలు చేసే రాజ్యసభ సభ్యుడిని నాకు తెలియదా?' అని ఆయన ఎదురు ప్రశ్నించాడు. ఇందులో వివాదం ఏమీ లేదని, తాము సుప్రీంకోర్టు సూచనలతో రిజిస్టర్ చేయించామని, దీనిపై ఏవైనా వివాదం వస్తే....కోర్టు తీర్పు ధిక్కరణ కేసు వేస్తానని ఆయన హెచ్చరించాడు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MP Kesava Rao  Gadwala Vijayalaxmi  Land Scam  Gold Stone Company  

Other Articles