Land Registration Mafia Scam Busted at Miyapur in Hyderabad

Land mafia gang busted in hyderabad

Miyapur Land Mafia, Kukatpally Land Scam, Hyderabad Land Mafia, TRS Govt Kukatpally Scam, KCR Miyapur Land Scam, Gold Stone Prasad Land Scam, Kukatpally Land Scam Arrests, Telangana Land Mafia

Land Mafia Gang Busted in Hyderabad . Police Arrests Kukatpally Sub Register Srinivas Rao and Builders. Miyapur 693 Acres Land Illegal Land Registaration to them. Gold Stone prasad not yet arrested due to sufficient evidences.

కూకట్ పల్లిలో భారీ భూ‘కంపం’

Posted: 05/29/2017 08:59 AM IST
Land mafia gang busted in hyderabad

అవినీతి రహిత ప్రభుత్వంగా చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద షాక్ కొట్టింది. దాదాపు 10 వేల కోట్ల రూపాయల విలువైన బడా స్కాం ఒక్కసారిగా వెలుగు చూసింది. రాజధాని లోనే ఇది బయటపడటంతో మరింత సంచలనంగా మారింది. కూకట్ పల్లి పరిధిలో అక్రమ అధికారులు తమ చేతి వాటం చూపి అక్రమార్కులకు కోట్లకు భూములను అన్యాక్రాతం చేశారు.

ఈ భూకుంభకోణం వివరాల్లోకి వెళ్లితే.. మియాపూర్ లోని సర్వే నెంబర్ 100 లో 207 ఎకరాలు, సర్వే నెంబర్ 101లో 231 ఎకరాలు, సర్వే నెంబర్ 20లో 109 ఎకరాలు, సర్వే నెంబర్ 28లో 145 ఎకరాలు ఇలా పది వేల కోట్ల రూపాయల విలువైన 692 ఎకరాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు గుర్తించారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినట్టు అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఈ అక్రమ దందాకు తెరతీసిన సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ స్కాంలో శ్రీనివాసరావుతోపాటు బిల్డర్లు బిఎస్ పార్థసారథి, పివిఎస్ శర్మలను కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిం చారు. రూ.587 కోట్ల విలువైన 698 ఎకరా ల ప్రభుత్వ భూమిని సబ్‌రిజిస్టార్ రాచకొండ శ్రీనివాసరావు (56) నలుగురు బిల్డర్లకు అక్రమంగా రిజిస్ట్రేషన్ తో కట్టబెట్టాడు. జూబ్లీహిల్స్‌లో నివాసముంటు న్న ట్రినిటి ఇఫ్రా వెంచర్స్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ పి.ఎస్.పార్థసారథి (60), సువిషాల్ పవర్ జెన్ లిమిటెడ్ డైరెక్టర్ పి.వి.ఎస్.శర్మ (72)లతో పాటు మరో ఇద్దరు బిల్డర్లకు రిజిస్ట్రేషన్ చేశాడు

ఈ వ్యవహారం బయట పడడంతో మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కూకట్‌పల్లి పోలీసులు నిందితులపై క్రైమ్‌నెంబర్ 366/2017పై ఐపిసి 409,418,419,420,423,467,468,471,120(బి) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రభుత్వ భూమిని బిల్డర్లకు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను పోలీసులు కూకట్‌పల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకుని పరిశీలించారు. కోట్ల రూపాయల లంచం తీసుకుని అక్రమంగా ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక కేసులో మరో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న పొన్నాపుల సంజీవ్ ప్రసాద్ అలియాస్ గోల్ట్ స్టోన్ ప్రసాద్ ను సరైన ఆధారాలు లేవంటూ పోలీసులు అరెస్ట్ చేయలేదు. గతలంోనూ ల్యాండ్ అండ్ పైనాన్స్ వివాదాలు కేసుల్లో ప్రసాద్ నిందితుడిగా ఉన్నాడు. నిష్పాక్షింగా దర్యాప్తు జరిపిస్తే.. తెరవెనుక ఉన్న బడా భూ బకాసురులు బయటికి వచ్చే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం అంత సాహసం చేస్తుందా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Kukatpally  Miyapur Land Scam  Illegal Registration  

Other Articles