Nagaland Ex Cop in major Scam with Hawala Money

President medal cop in major corruption scam

Nagaland Hawala Scam, Nagalad Cop Scam, Nagaland Ex Cop Scam, Hawala Cop, M K R Pillai, Ex Cop Hawala Company

Nagaland EX Cop, President Medal Won Candidate M K R Pillai in Nagaland's Big Scam. IT Department raids were conducted in Kerala, Karnataka, Nagaland and Delhi after doubts emerged that Pillai's Sreevalasam Group was involved in suspicious financial dealings.

ప్రెసిడెంట్ మెడల్ కానీ.. పక్కా 420

Posted: 06/10/2017 10:19 AM IST
President medal cop in major corruption scam

నాగాలాండ్ లో ఈ మధ్య ఓ భారీ స్కాం బయటపడింది. బడా నేతలతోపాటు వ్యాపారవేత్తలు కూడా ఇందులో వాటాదారులు కావటంతో అధికారులు దేశం మొత్తం విస్తృత స్థాయిలో దాడులు జరిపారు. ఆ క్రమంలో ఓ చిన్న లింకు పెద్ద అవినీతి తిమింగలాన్ని బయటపడేసింది. బినామీ కంపెనీతో హవాలా డబ్బును దాచాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కేరళలోని కోచిలో ఓ మాజీ ఏఎస్పీ కూడబెట్టిన అక్రమస్తులను గుర్తించిన ఆదాయపన్ను శాఖ అధికారులకు కళ్లు బైర్లు కమ్మాయి. నాగాలాండ్‌లో ఏఎస్పీగా ఎంకేఆర్ పిళ్లై పనిచేసిన విధి నిర్వహాణలో సిన్సియర్ అనే పేరుంది. అంతేకాదు ఆయన చేసిన సేవలకు రాష్ట్రపతి అవార్డు కూడా అందుకున్నాడు. ఆరేళ్ల క్రితం రిటైర్ అయ్యాక రూ.400 కోట్ల విలువైన శ్రీవలసమ్ అనే సంస్థకు అధినేతగా మారాడు.

1971 లో కానిస్టేబుల్ గా విధుల్లో చేరిన ఎంకేఆర్ పిళ్లై అడిషనల్ సూపరింటెండెంట్‌ ఆఫ్ పోలీస్‌గా విధులు నిర్వహించాడు కూడా. పలువురు రాజకీయ నాయకులు, టాప్ బ్యూరోక్రాట్లతో పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు స్కాంలో ఆరోపణలు రావటంతో తనకున్న ‘పెద్ద’పరిచయాలతో ప్రభుత్వ నిధులను ఏమైనా అక్రమంగా దారి మళ్లించాడా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నాడు. ఈ కోణంలోనే పిళ్లైను ప్రశ్నించనున్నట్టు కూడా తెలిపాడు.

కేరళ, కర్ణాటక, నాగాలాండ్, ఢిల్లీలో పిళ్లైకి చెందిన శ్రీవలసమ్ గ్రూప్ కార్యాలయాలపై అధికారులు ఏక కాలంలో దాడులు చేశారు. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై ఈ దాడులు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత తన ఆస్తులు రూ.50 కోట్లని పిళ్లై ప్రకటించారు. అయితే అతడు చెప్పిన లెక్కలకు, చూపించిన ఆదాయానికి పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చిన ఐటీ అధికారులు దర్యాప్తు ప్రారంభించగా అక్రమ డొంక బయటపడింది. దీని వెనుక ఉన్న స్కాం మొత్తం చేధించే పనిలో బిజీగా ఉంది ఐటీ శాఖ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagaland  EX Cop M K R Pillai  Hawala Money Scam  

Other Articles