Telangana Govt to curb Online Gambling ఆ ఆటలు అడితే ఇక కటకటాల వెనక్కే..

Telangana govt to curb online gambling

telangana police to file cases in onling gambling, cricket bettings crime, cricket bettings online gambling, horse riding telangana police, Hyderabad, Telangana govt, online gambling, cricket bettings, horse riding bettings, gambling, arriest, crime

The Telangana government is planning to curb the online gambling in the state. As part of the decision, the govt has going to make some amendment in the Gaming Act-1974.

ఆ ఆటలు అడితే ఇక కటకటాలే.. ప్రభుత్వం ఉక్కుపాదం

Posted: 05/21/2017 09:36 AM IST
Telangana govt to curb online gambling

తెలంగాణ రాష్ట్రం అవిర్భావంతోనే అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. జూదశిఖామణులపై కోరడా ఝళిపించింది. అయినా పేకాట పాపారావులు, ఆన్ లైన్ వేదికగా తమ జూదకళలను ప్రదర్శిస్తూ.. ధర్మారాజు తరహాలో ఇల్లు గుల్ల చేస్తున్నారు. ఈ విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తాజాగా రావడంతో., ఇక అంతర్జాల వేదికపై సాగుతున్న జూదానికి చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మురిపించి, మెరిపించి నట్టేట ముంచే ఈ ఆన్‌లైన్ జూదానికి చెక్ చెప్పాలని నిర్ణయించింది. చట్టాలను సవరించి ఇకపై ఇంట్లో అడినా.. మొబైల్ ఫోన్ లో అడినా వారిపై కేసులు నమోదు చేసిన కటకటాల వెనక్కి పంపుతామని హెచ్చరికలు జారీ చేసింది.

అందులో భాగంగా తెలంగాణ గేమింగ్ చట్టం-1974కు సవరణలు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో ‘సైబర్ స్పేస్’ అనే పదాన్ని జోడించడం ద్వారా ఆన్‌లైన్‌లో జోరుగా సాగుతున్న గుర్రపు పందేలు, పేకాట, క్రికెట్ బెట్టింగ్ వంటివాటిపై ఉక్కుపాదం మోపేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా కంప్యూటర్‌, సెల్‌ఫోన్‌లలో ఈ ఆటలు ఆడేవారిపై  కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తారు. ఇంట్లో రహస్యంగా ఆడుతున్నామని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే గేమింగ్ సైట్లలో తరచూ లాగిన్ అయ్యే వారిపై పోలీసులు నిఘా పెడతారు.

సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో వివరాలు సేకరించి క్రిమినల్, నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెడతారు. గేమింగ్ నిర్వాహకులపైనా చర్యలు తీసుకుంటారు. దాడుల్లో పట్టుబడే నగదు, ఆభరణాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుంటారు. నిందితులను అరెస్ట్ చేయడమే కాకుండా ఆట కోసం ఉపయోగించిన బ్యాంకు ఖాతాను స్తంభింపజేస్తారు. ఈ నేరం చేస్తూ తొలిసారి పట్టుబడితే ఏడాది జైలు, రూ.5 వేల జరిమానా, రెండోసారి పట్టుబడితే అందుకు రెట్టింపు శిక్ష, జరిమానా విధిస్తారు. చట్టం సవరణకు న్యాయపరమైన ప్రక్రియ ఇప్పటికే పూర్తి అవడంతో త్వరలోనే ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles