Pakistan to change legal team fighting Jadhav's case at ICJ కులభూషణ్ సేఫ్.. భారత్ దెబ్బకు లాయర్ ను మార్చిన పాక్

Pakistan to change legal team fighting jadhav s case at icj

kulbhushan jadhav, indian prisoner kulbhushan jadhav, kulbhushan jadhav death row, indian spy kulbhushan jadhav, indian spy death row, khawar qureshi, pakistan lawyer khawar qureshi, world news, latest world news

pakistan makes legal team responsible for setback caused by the ICJ court in indian kulbhushan jadav case, changes the legal team.

కులభూషణ్ సేఫ్.. భారత్ దెబ్బకు లాయర్ ను మార్చిన పాక్

Posted: 05/21/2017 10:11 AM IST
Pakistan to change legal team fighting jadhav s case at icj

గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్ అరెస్ట్ చేసిన భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ ను పాకిస్తాన్ ఉరి తీసిందన్న అనుమానాలు ఒక్కసారిగా నూట ఇరవై కోట్ల మంది భారతీయులను కలవరానికి గురిచేశాయి. అయితే ఈ నేపథ్యంలో కుల్ భూషన్ యాదవ్ బతికే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. న్నది ఆ వార్త సారాంశం. పాక్ ఆర్మీ కోర్టు జాదవ్‌కు విధించిన ఉరిశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది.

అయినా అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును ఉల్లఘించిన పాకిస్థాన్.. జాదవ్ ను ఉరి తీసిందన్న వార్తలు దేశప్రజలను కలవరానికి గురిచేశాయి. పాక్ ఇప్పటికే జాదవ్‌ను చంపేసి ఆ విషయంలో నాటకాలు ఆడుతోందని అనుమానాలు భారతీయులలో బలంగా వినిపించాయి. ఈ విషయంలో పాక్ తీరుపై పలు అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ జాదవ్ జీవించే ఉన్నారంటూ ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. దీంతో ప్రజల్లో ఏమూలో ఉన్న అనుమానాలు పటాపంచలు అయ్యాయి. ప్రభుత్వ ప్రకటనతో ఆయన కుటుంబ సభ్యులు సంతోషించారు. కేంద్ర ప్రకటన నేపథ్యంలో యావత్ భారతదేశ వ్యాప్తంగా హర్షాతిరేకలు వెల్లివిరిసాయి.

ఇక కుల్ భూషణ్ జాదవ్ వ్యవహారంతో భారత్ దెబ్బకు పాకిస్థాన్ ఏకంగా తన న్యాయవాదిని మార్చేసింది. కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో సరిగా వాదనలు వినిపించలేదన్న కారణంతో అతడిని తప్పించింది. జాదవ్ కేసులో బ్రిటన్‌కు చెందిన ఖవార్ ఖురేషీ ఇప్పటి వరకు పాక్ తరఫున వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో పాక్ తీరును తప్పుబట్టిన న్యాయస్థానం జాదవ్ ఉరిపై స్టే విధించింది. తాము తుది తీర్పు ఇచ్చే వరకు ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని కూడా అదేశించింది.

దీంతో అంతర్జాతీయ సమాజం ముందు తాము దోషిలా నిలబడాల్సి వచ్చిందన్న అవమానంతో రగిలిపోతున్న పాక్.. జాదవ్ కేసు వ్యవహరాంలో ఖురేషీని తప్పించి, ఆయన స్థానంలో ఆ దేశ అటార్నీ జనరల్ అష్తార్ అవౌసఫ్‌ను నియమించింది. ఈ మేరకు పాక్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి  పాక్ సైన్యం, ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఐసీజే ఎదుట తమ వాదనలను బలంగా వినిపించడానికి కృషి చేస్తానని అష్తార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kulbhushan jadhav  indian prisoner  death row  legal team  khawar qureshi  pakistan  

Other Articles