janasena to create history in forth comming elections చరిత్ర సృష్టించేందుకు సిద్దమవుతున్న జనేసేన

Janasena to create history in forth comming elections says no to other party leaders

janasena, pawan kalyan, jana sainam, upcomming elections, assembly elections, no entry for other party leaders, no entry for polictician kins

janasena to create history in forth comming elections, says no to other party leaders and also declares that there are no post in the party.

జనసేనలో అందరూ సైనికులే.. వలస, వారసత్వ నేతలకు చెక్

Posted: 05/21/2017 08:47 AM IST
Janasena to create history in forth comming elections says no to other party leaders

పవర్ స్టార్ పవన్ కల్యాణ్  స్థాపించిన జనసేన పార్టీలో బూత్ స్టాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అందరూ జనసైనికులేనని, ఈ పార్టీలో ఎవరూ లీడర్లు వుండరని సంకేతాలు వస్తున్నాయి. కార్యకర్తల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న అధిష్ఠానం పార్టీ నిర్మాణంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రజా సమస్యలను ప్రశ్నించడమే లక్ష్యంగా చెబుతున్న జనసేనలో నాయకులకు చోటు లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం పనిచేసే వారికి ఎటువంటి హోదాలు ఇవ్వరని.. అన్ని పార్టీల తరహాలో మాదిరిగా కాకుండా ఈ పార్టీలో అందరూ సమానమేనన్న భావనతోనే ముందుకు వెళ్తుందని తెలుస్తుంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా జనసేన్యమేనన్న సంకేతాలు అందుతున్నాయి.

రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎవరికీ ఎలాంటి పదవులు ఉండవుని సమాచారం. దీంతో రాజకీయాల్లో సరికొత్త ఒరవడి సృష్టించేందుకు రెడీ అవుతోంది జనసేన. అందరూ జన సైనికులే. ప్రస్తుతం ఎంపిక ప్రక్రియ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఎంపిక చేస్తున్న వారిలో చురుకైన వారికి 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. పార్టీ నిర్వహిస్తున్న పరీక్షల్లో ఎంపికైన వారితో పవన్ నేరుగా మాట్లాడుతున్నారు. ఇలా ఎన్నికైన వారు ఆయా జిల్లాల పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఇక పార్టీలోకి వలసలకు చెక్ పెట్టనుంది కూడా. ఇతర పార్టీలలో నుంచి వచ్చిన వారు మన పార్టీలో మాత్రం ఎందుకు వుంటారు.. ఇక్కడ కూడా అవసరం తీరిన తరువాత వెళ్లిపోతరాని, అలాంటి నేతలకు అవకాశం ఇవ్వకూడదని కూడా జనసేన భావిస్తుంది. దీంతో పాటు వారసత్వ నేతలను కూడా పార్టీలో చేర్చుకోరాదని నిర్ణయించింది. ప్రజల్లో నుంచే నేతలను ఎంపిక చేసుకునేందుకు ప్రతిభ గల వ్యక్తుల కోసం అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే చాలామందిని వడపోసి యువనేతలను ఎంచుకుంది. ఉత్తరాంధ్రలోనూ మొదలైన ఈ ప్రక్రియ ఇప్పుడు తుది దశకు చేరుకోబోతోంది. ఆసక్తి ఉండి దరఖాస్తు చేసుకున్న అందరికీ పరీక్షలు నిర్వహిస్తోంది.

విషయం, ప్రతిభ ఉన్న వారి కోసం మూడు విభాగాల్లో పరీక్షలు నిర్వహిస్తోంది. అభ్యర్థుల రచన, మాట్లాడే తీరు, సమస్యలపై వారికి ఉన్న అవగాహనను వీడియో తీసి నిపుణుల సమక్షంలో దానిని పరిశీలించి మార్కులు వేస్తారు. వారివారి విభాగాల్లో మంచి పనితీరు కనబరిచిన వారిని ఎంపిక చేసి చివరిగా పవన్ నేతృత్వంలో ఓ టీమ్‌ను ఎంపిక చేస్తారు. ఇదీ జనసేన వ్యూహం. నాయకులు ప్రజల్లో నుంచే రావాలని, వారసత్వ, వలస నేతలను పార్టీకి దూరంగా ఉంచాలని భావిస్తోంది. తద్వారా రాజకీయ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : janasena  pawan kalyan  jana sainam  upcomming elections  assembly elections  

Other Articles