MP Rayapati walksout from southcentral railway meet రైల్వే సమావేశం నుంచి రాయపాటి వాకౌట్..

Mp rayapati walksout from southcentral railway meet

Rayapati fires on railway officials, Rayapati lashes out on railway officials, Rayapati, Rayapati Sambasiva Rao, south central railway meet, vishaka railway zone, railway officials, vijayawada

Guntur Member of Parliament Rayapati Sambasiva Rao walksout from south central railway meet, alleging that officials are irresponsible, and said if this prevails people will beat them with slippers

దక్షిణమధ్య రైల్వే సమావేశం నుంచి రాయపాటి వాకౌట్..

Posted: 05/09/2017 02:04 PM IST
Mp rayapati walksout from southcentral railway meet

దక్షిణమధ్య రైల్వే విభాగం అధికారులపై గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైల్వే అధికారులు తీరు మార్చుకోకపోతే ప్రజలు తమను చెప్పులతో కొడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైల్వే బోర్డు అధికారులు ఏకంగా ప్రధాని, కేంద్రమంత్రుల కంటే కూడా ఫవర్ ఫుల్ గా మారిపోయారని విమర్శించారు. విజయవాడలో దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ తో జరుగుతున్న సమావేశం నుంచి అర్థంతరంగా బయటికి వచ్చేసి.. వాకౌట్ చేసిన ఆయన రైల్వే అధికారులపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన రైల్వే అధికారుల తీరు వల్లే విశాఖ రైల్వే జోన్ రావడం లేదని, ఇందుకు సంపూర్ణ బాధ్యులు అధికారులేనని అరోపించారు. విశాఖ రైల్వే జోన్ మంజూరుకు అవసరమైన ప్రాధమిక చర్యలు చేపట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రధాన మంత్రి మోడీ వరకు వెళ్లి తాము సమస్యలు పరిష్కరిస్తుంటే...అధికారులు ఏమాత్రం సహకరించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వేకు సానుకూలంగా అధికారులు పనిచేయడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు.

గుంటూరు-తెనాలి డబ్లింగ్ పనులు పదేళ్లుగా కొనసాగుతూనే వున్నాయని ఇది అదికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని చెప్పారు. ఇక తాను రైల్వే అధికారులను గుంటూరు నుంచి చెన్నై వెళ్లేందుకు పగటిపూట రైలును వేయాలని అభ్యర్థించి కూడా ఏళ్లు గడుస్తున్నా ఇంకా దాని విషయంలో ఏలాంటి నిర్ణయం తీసుకోలేదని ధ్వజమెత్తారు. చిన్న చిన్న పనులు కూడా అధికారులు చేయకపోతే.. తాము ప్రజలకేం చెబుతామని ఆయన నిలదీశారు. అయితే పరిస్థితి ఇలాగే కొనసాగిన పక్షంలో తమను ప్రజలు చెప్పు తీసుకుని కొడతారని ఆయన అవేదన వ్యక్తం చేశారు.

అధికారుల తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు అన్ని మర్చిపోతారు.. వారి కోసం ప్రజాప్రతినిధులు అడిగిన విషయాలను కూడా త్వరలోనే మర్చిపోతారన్నట్లు వుందని ఎద్దేవా చేశారు. మళ్లీ ఎన్నికల నాటికి విశాఖ రైల్వేజోన్ ను కూడా ప్రజలు మర్చిపోతారన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారని అక్షేపించారు. ముందుగా జోన్ ప్రకటిస్తే.. ఆ తరువాత వైజాగ్ కు మార్చుకోవచ్చని రాయపాటి అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక పనులను కూడా అధికారులు పూర్తి చేయలేదని ఆయన మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles