Mallya guilty of contempt: SC ఆర్థిక నేరస్థుడిపై కోర్టుధిక్కార కేసు..

Sc finds mallya guilty of contempt directs him to appear on 10 july

vijay mallya, supreme court, banks, bank loans, vijay mallya debt, vijay mallya loans, vijay mallya banks, vijay mallya supreme court, Mallya Digaeo sweet heart deal, Supreme Court, Vijay Mallya, Vijay Mallya contempt of court, Vijay Mallya disclosure of assets, India news, latest news

The Supreme Court found Vijay Mallya guilty of contempt of court and directed him to appear in the court on 10 July for arguing on quantum of punishment in the matter.

ఆర్థిక నేరస్థుడిపై కోర్టుధిక్కార కేసు.. తీర్పు రిజర్వు

Posted: 05/09/2017 11:41 AM IST
Sc finds mallya guilty of contempt directs him to appear on 10 july

బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టి విదేశాలకు పారిపోయిన అర్థిక నేరస్థుడు విజయ్ మాల్యాకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. భారత బ్యాంకులకు సుమారుగా రూ. 9 వేల కోట్లకు పైగా బకాయి పడి, వాటిని చెల్లించకుండా లండన్ కు వెళ్లి తలదాచుకుంటున్న లిక్కర్ డాన్ పై కోర్టు ధిక్కరణ నేరం కింద సమన్లు జారీ చేసింది. ఆయనపై నమోదైన అర్థిక నేరాలకు సంబంధిన కేసులో కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించినా, దానిని అయన లక్ష్యపెట్టకుండా తానే ఫలాన సమయంలో వస్తానని గడువు విధంచడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది.

కోర్టు అదేశాలను ధిక్కరించడంతో ఆయనపై సమన్లు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. జూలై 10న హాజరు కావాలని ఆదేశించింది. ఈ లోగా విజయ్ మాల్యా న్యాయస్థానం ఎదుట హాజరుకాని పక్షంలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని స్పష్టం చేసింది. తాజా అదేశాలను కూడా మాల్యా ధిక్కరించి.. వ్యక్తిగతంగా న్యాయస్థానికి హాజరుకాని పక్షంలో ఆయనకు సుమారు ఆరు నెలల కారాగార వాసం పడే అవకాశాలు వున్నాయని న్యాయనిపుణులు పేర్కోంటున్నారు.

ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడిగా అనేక కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న మాల్యాకు న్యాయస్థానం తాజా ఆదేశాలతో ఉచ్చు బిగుసుకుంటుంది. దీంతో పాటుగా డియోజీయో సంస్థ నుంచి పొందిన 40 మిలియన్‌ డాలర్లను డిపాజిట్‌ చేసేలా ఆయనపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్ పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా, లండన్ లో ఇటీవల అరెస్ట్ అయి, ఆపై గంటల వ్యవధిలోనే బెయిల్ పై బయటకు వచ్చిన మాల్యాను ఎలాగైనా ఇండియాకు తీసుకురావాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ విభాగాలు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Mallya  contempt of court  Supreme Court  indian banks  

Other Articles