అర్కే నగర్ ఉపఎన్నికలలో అధికారపార్టీ నేతపై చెప్పులు.. shoe hurled at ruling party spokesperson in rk nagar by elections

Shoe hurled at ruling party spokesperson in rk nagar by elections

AIADMK amma, spokesperson, CR Saraswathi, Amma Deepa Peravai, deepa jayakumar, Dinakaran, AIADMK candidate, RK Nagar bypoll, palnisamy, paneer selvam, tamil nadu, CR Saraswati. spokes person, sasikala, jayalalithaa, Jayalalithaa niece, Amma Deepa Peravai, Deepa jayakumar, palnisamy, paneer selvam, DMK, mk stalin, tamil nadu politics

Set back to the AIADMK (Amma) leader and spokes person CR Saraswathi in the R.K. Nagar by-elections as a man hurled shoe at her in a meeting.

అర్కే నగర్ ఉపఎన్నికలలో అధికారపార్టీ నేతపై చెప్పులు..

Posted: 04/01/2017 02:12 PM IST
Shoe hurled at ruling party spokesperson in rk nagar by elections

తమిళనాడు రాజకీయాల్లో తమ ప్రభావాన్ని చాటాలని భావిస్తున్న శశికళ వర్గానికి చేదు అనుభవం ఎదరైంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే మాజీ అధినేత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన అమె సోంత నియోజకవర్గం అర్కే నగర్ కు ఈ నెల 12న జరగనున్న ఉప ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వ సత్తాను చాటాలని భావిస్తున్న అధికార పళనిస్వామి పార్టీకి ఘర పరాభవం ఎదురైంది. జయలలిత మరణానికి శశికళ అమె వర్గం నేతలే కారణమన్న భావనలో వున్న అమ్మ అభిమానులలో ఒకరు అధికార పార్టీనేతను పరాభవించారు.

శశికళ మేనల్లుడు టీటీవీ దినకరణ్ అర్కేనగర్ ఉప ఎన్నికల బరిలో నిలువగా, అతని విజయం గురించి అనేక మంది అధికార పార్టీ నేతలు ఇప్పటి నుంచే ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీలకు ధీటుగా అధికార పార్టీ ప్రచారం చేస్తూనే ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని తీవ్రంగా యత్నిస్తున్నారు. అటు డీఎంకే, ఇటు దీపా జయకుమార్, మరోవైపు పన్నీరు సెల్వం వర్గం నుంచి మధుసూదనన్ తదితరలు ఎన్నికల బరిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా అర్కేనగర్ లో చతుర్ముఖ పోటీ నెలకోంది.

కాగా, ఆ పార్టీ సీనియర్ నేత.. అధికార ప్రతినిధి అయిన సీఆర్ సరస్వతి ఆర్కే న‌గ‌ర్‌లో ప్రచారం చేస్తుండగా ఓ వ్యక్తి ఆమెపైకి బూటు విసిరాడు. స్థానికంగా జరుగుతున్న ఓ చిన్నపాటి సమావేశంలో పాల్గోన్న సరస్వతిపై ఓ అగంతకుడు బూటు విసిరాడు. ఈ ఘ‌ట‌న‌తో అక్క‌డ కొద్దిసేపు ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది. అగంతకుడు ప్రత్యర్థి పార్టీలకు అమ్ముడు పోయి మద్యం మత్తులో తమ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నాడని సరస్వతి విమర్శించారు. అయితే ఏ ప్రత్యర్ధి పార్టీ నేతలు ప్రోత్భలంతో ఈ చర్యకు పూనుకున్నాడన్న విషయం మాత్రం తెలిపలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIADMK amma  Dinakaran  CR Saraswati. Stalin  DMK  RK Nagar bypoll  palanisamy  paneerselvam  tamilnadu  

Other Articles