దేశంలో నల్లధనం ఎక్కడిదీ..? ఎప్పుడో ఎల్లలు దాటింది.. Arun Shourie flays `insecurity' haunting Narendra Modi

Black money stashed in foreign shores not in india arun shourie

demonetisation, black money, arun shourie, arun shourie blackmoney, bjp blackmoney

Coming down heavily on the demonetisation drive, former Union Minister and eminent journalist Arun Shourie wondered how the move would help check black money which is lying in foreign shores.

దేశంలో నల్లధనం ఎక్కడిదీ..? ఎప్పుడో ఎల్లలు దాటింది..

Posted: 01/29/2017 09:48 AM IST
Black money stashed in foreign shores not in india arun shourie

పేదలను, దేశ సామాన్య ప్రజలను దొచుకున్న పెద్దలందరూ తమ అక్రమార్జనంతా దేశ ఎల్లలు దాటించి విదేశాల్లో దాచుకున్నారని, అయితే నల్లధనం దేశంలో వుందని అందకనే తాము పాత పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని ప్రకటించడంలో కేంద్రప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటీ అర్థం కావడం లేదని ప్రముఖ పాత్రికేయుడు, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరి అభిప్రాయపడ్డారు. పాత పెద్ద నోట్ల రద్దు వల్ల ఒనగూరే లాభానష్టాలపై అవగాహన లేకనే ఇలాంటి చర్యలకు కేంద్రం పాల్పడిందని విమర్శించారు. బ్లాక్‌మనీ ఉన్న వారెవరైనా దానిని విదేశాల్లోనే పెట్టుబడుల రూపంలో దాచి పెట్టుకుంటారని వ్యాఖ్యానించారు.

దేశంలో పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని ఎలా వెలికితీస్తారని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు నోట్ల రద్దు తో అవినీతి అంతం కావడం మాట పక్కన బెడితే.. మరో కోణంలో అవినీతి చోటుచేసుకునేందుకు అస్కారముంటుందన్న అనుమానాలను వ్యక్తం చేశారు. తాజాగా కోత్త కర్సెన్సీ నోట్ల కట్టలు అనేకం కేంద్రం ప్రభుత్వం విధించిన అంక్షలను, పరుధులను దాటుకుని ఏకంగా బడాబాబుల వద్దకు చేరిన ఘటనలను మనం చూస్తూనే వున్నామని.. ఇలాంటి అనేక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని ఆయన పేర్కోన్నారు.

నల్లధనం కూడబెట్టిన వ్యక్తి ఎవరైనా దానిని రూపాయల రూపంలోనే దాచి ఉంచుకుంటాడా? అని ప్రశ్నించారు. నల్లధనాన్ని కంపెనీలు, ఎస్టేట్లు కొనుక్కునేందుకు ఉపయోగిస్తారని చెప్పారు. డెంగీ దోమ స్విట్జర్లాండ్‌లో తిరుగుతూ ఉంటే దాని కోసం ఇక్కడ వెతకడమేంటని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నోట్లరద్దుతో బ్లాక్‌మనీని కట్టడి చేయటం సాధ్యమా కాదా, మంచిదా చెడ్డదా అనేది నేతలతో పాటు ప్రజలకు కచ్చితంగా తెలియదని అన్నారు. బ్యాంకింగ్‌ సెక్టార్‌ను వృద్ధి చేయటం, పన్నుల విధానాన్ని పటిష్టం చేయటంపై దృష్టి పెట్టాల్సి ఉండగా బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonetisation  black money  arun shourie  arun shourie blackmoney  bjp blackmoney  

Other Articles