అధ్యక్ష నిర్ణయంపై కొర్టు స్టే.. ట్రంప్ కు తొలి ఎదురుదెబ్బ.. set back for us president in federal court

Set back for us president donald trump in federal court

Donald Trump, New York Federal court, mmigration ban, islamic countries, US, Donald Trump, refugees, travel ban, travellers, muslim nations

A federal judge in Brooklyn issued an emergency stay against President Donald Trump's executive order banning immigration from certain predominantly Muslim countries.

అధ్యక్ష నిర్ణయంపై కొర్టు స్టే.. ట్రంప్ కు తొలి ఎదురుదెబ్బ..

Posted: 01/29/2017 10:31 AM IST
Set back for us president donald trump in federal court

అమెరికా అధ్యక్షుడు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కు తొలిసారిగా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏడు ఇస్లామిక్‌ దేశాల పౌరులను తమ దేశంలోకి అడుగుపెట్టనీయకుండా డొనాల్డ్‌ ట్రంప్‌ వెలువరించిన ఉత్తర్వుపై న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు అత్యవసర స్టే విధించింది. డొనాల్డ్ నిర్ణయంతో న్యూయార్క్ లోని జేఎఫ్‌ కే విమానాశ్రయంలో 12 మంది శరణార్థులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరిని మాత్రమే అమెరికా అధికారులు విడిచిపెట్టారు. మిగతావారి తరపున కోరుతూ అమెరికన్ సివిల్‌ లిబర్టీస్ యూనియన్‌(ఏసీఎల్ యూ) కోర్టును ఆశ్రయించింది.

అమెరికా పోలీసులు నిర్బంధించిన వారిని 14 నుంచి 24 గంటల్లో విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. తాము విధించిన స్టే దేశమంతా వర్తిస్తుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ఉన్న శరణార్థులను వెనక్కు పంపొద్దని.. అంటే దీనర్థం వారిని అమెరికాలోకి అనుమతించమని కాదని... వీరిని గ్రే ఏరియా(శరణార్థి శిబిరం)లో ఉంచాలని సూచించింది. శరణార్థులను అనుమతించకూడదని  డొనాల్డ్ ట్రంప్ అధికారిక ఉత్తర్వు జారీచేయడంతో అమెరికా విమానాశ్రయాల్లో ఏడు ఇస్లామిక్‌ దేశాల పౌరులను, శరణార్థులను అడ్డుకున్నారు. అన్నిపత్రాలు ఉన్నప్పటికీ వారిని అనుమతించలేదు.

ఇక మరోవైపు అమెరికా అంతటా ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనేక మంది నిరసనలకు దిగుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూమి ట్రంప్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ట్రంప్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా న్యూయార్క్‌లోని జాన్‌ ఎఫ్‌ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద వందలాది మంది గుమిగూడారు.  'మేమంతా ప్రవాసులమే', 'శరణార్థులను అనుమతించాలి, శరణార్థులను స్వాగతించాలి' అన్న నినాదాలతో వారు ఆందోళన నిర్వహిస్తున్నారు. మరోవైపు నెవార్క్‌ లిబర్టీ విమానాశ్రయం వద్ద కూడా వందలమంది నిరసనకారులు గుమిగూడి ట్రంప్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనప్రదర్శన నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles